|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: షాకింగ్ ట్విస్ట్! దాసు కిడ్నాప్ సీన్ సీసీటీవీలో రికార్డ్! జ్యోత్స్న ఆట కట్?

Published: 22-01-2026, 10:05 PM
కార్తీక దీపం 2: షాకింగ్ ట్విస్ట్! దాసు కిడ్నాప్ సీన్ సీసీటీవీలో రికార్డ్! జ్యోత్స్న ఆట కట్?
  • కాంచన చేతుల మీదుగా సుమిత్రకు అమ్మవారి రక్షాబంధనం!
  • ఇంటికి వచ్చిన దాసును తప్పించిన జ్యోత్స్న, షాకింగ్‌ ట్విస్ట్!
  • సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాసు కిడ్నాప్ దృశ్యాలు!
  • జ్యోత్స్న అసలు రూపం బయటపడుతుందా? ఉత్కంఠ రేపుతున్న కార్తీక్!

కార్తీక దీపం 2 సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్! జ్యోత్స్న ఆట కట్టించడానికి కార్తీక్ ప్లాన్! దాసు కిడ్నాప్ మిస్టరీ వీడే సమయం ఆసన్నమైంది. అసలేం జరగబోతుందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే!

సుమిత్రకు కాంచనమ్మ రక్షాబంధనం!

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 23వ ఎపిసోడ్‌లో శ్రీధర్ వచ్చి కాంచనతో మాట్లాడి దశరథ్ ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మవారి గుడిలో పూజ చేసిన అమ్మవారి రక్షను సుమిత్రకు కడుతుంది కాంచన. దాసు ఇంటికి వస్తాడు. రౌడీలు కాల్ చేసి జ్యోత్స్నకు చెబుతారు. దాసు వచ్చి బయట పడిపోవడం పారిజాతం చూస్తుంది. దాసు అంటూ అరుస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడికి మొక్కుకుని తాళి కళ్లకు అద్దుకుంటుంది కాంచన. అప్పుడే శ్రీధర్ వస్తాడు. నువ్వు తాళి కళ్లకు అద్దుకుంటున్న మాత్రానా నన్ను ఇష్టపడుతున్నావని అనుకోను. ఆడదానికి ఐదో తనం అలంకరణ కాదు. జీవితంలో ఒక భాగం అని అంటాడు శ్రీధర్ .

దాసు రీఎంట్రీ, జ్యోత్స్న ప్లాన్ B!

మరోవైపు కిచెన్‌లో దీపతో కార్తీక్‌కు తాటిబెళ్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం అని సుమిత్ర చెబుతుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను చనిపోయేటప్పుడు నా కూతురు ఉండాలి అని సుమిత్ర అన్నది గుర్తు చేసుకుని ఈ ఇంట్లో మీతోపాటే కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా అని దీప అంటుంది. నన్ను చూసుకోడానికి నా కూతురు ఉందని సుమిత్ర అంటుంది.

జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ప్రిపేర్ అవండని చెబుతారు అని శ్రీధర్ అంటాడు. ఇంతలో జ్యోత్స్నకు కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. రౌడీలు కాల్ చేసి మీ నాన్నగారు తప్పించుకున్నారని చెబుతారు. ఇంతలో గేట్ దగ్గరికి దాసు వస్తాడు. అది జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది.

సీసీ కెమెరాలో నిజం నిరూపణ!

పారు వచ్చేసరికే దాసును జ్యోత్స్న రౌడీలతో తప్పిస్తుంది. దాసు వచ్చాడురా. నా మీద ఒట్టు. వచ్చి పడిపోయాడురా అని పారిజాతం అంటుంది. అంతా వెతుకుతారు. పైన ఉన్న జ్యోత్స్న వైపు కార్తీక్ చూడటంతో చూపు పక్కకు తిప్పుకుంటుంది. మావయ్య కనిపించాడని పైకి వెళ్తాడు కార్తీక్. దాసు లేడని దశరథ్ అంటాడు. మరి కార్తీక్ పైకి ఎందుకు వెళ్తున్నాడని శివ నారాయణ వస్తారు. జ్యోత్స్నను అడుగుతాడు.

కానీ, నిజం తెలుస్తుంది. మనింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా. అవి చూపిస్తాయి దాసు మావయ్య వచ్చాడా లేదా అనేది అని కార్తీక్ అంటే.. మనవడా నీ బుర్ర సూపర్రా అని పారిజాతం అంటుంది. సీసీ కెమెరాలో దాసును రౌడీలు తీసుకెళ్లింది రికార్డ్ అయి ఉంటుంది. ఛ నిజం తెలిసిపోతుంది అని జ్యోత్స్న భయపడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది. దాసు కిడ్నాప్ మిస్టరీ వీడుతుందా? జ్యోత్స్న బాగోతం బయటపడుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.