|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తికేయ మాయం: సినిమాలకు అంత గ్యాప్ రావడానికి కారణమేంటి? ఏం జరిగింది?

Published: 18-02-2026, 12:05 AM
కార్తికేయ మాయం: సినిమాలకు అంత గ్యాప్ రావడానికి కారణమేంటి? ఏం జరిగింది?
  • ఆర్ఎక్స్ 100 మూవీతో కార్తికేయకు మంచి గుర్తింపు లభించింది.
  • ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
  • కార్తికేయ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఇంకా ప్రకటించలేదు.
  • సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నందువల్లే గ్యాప్ వచ్చిందని టాక్.

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఆయన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. దీంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రకటన చేయలేదు.

కార్తికేయకు ఆర్ఎక్స్ 100తో వచ్చిన గుర్తింపు

Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 మూవీ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ యూత్ చూపుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా అతని కెరియర్ కు బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆ హీరో ఆడపా దడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దాంతో ప్రస్తుతం హీరో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ ప్రకటించలేదు. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు హీరో కార్తికేయ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇకముందు సినిమాలు చేస్తాడా చెయ్యడా? ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి కార్తికేయ ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో అయిన కార్తికేయ ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. కానీ ఈమధ్య ఈయన నటించిన సినిమాలు పెద్దగా రాలేదు.. అయితే మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని మాత్రమే సొంతం చేసుకున్నాయి.. అయితే ఈ మధ్య ఈ హీరో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడన్న విషయం.. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈయన ఈమధ్య ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు.. కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో ఆయనను ట్యాగ్ చేస్తూ.. తర్వాత సినిమా ఎప్పుడు ఉంటుంది బ్రో? ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం కార్తికేయ సినిమాల కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్.. ఆచి తూచి స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నాడట. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చినట్లు టాక్.. మరి ఈ వార్తలపై హీరో స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

కార్తికేయ సినిమాలు ఎందుకు ఆడలేదు?

కార్తికేయ తదుపరి సినిమా ఎప్పుడు?

టాలీవుడ్ జనాలకు హీరో కార్తికేయ అంటే గుర్తుకు లేకపోవచ్చు.. కానీ ఆర్ఎక్స్ 100 మూవీ హీరో అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తాడు. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంతో కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది.. యూత్ లో మంచి క్రేజ్ కూడా దక్కించుకుంది. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత అప్కమింగ్ సినిమాలపై ఒక క్యూరియాసిటీ మొదలైంది. బెదురు లంక వంటి పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈయన రెండేళ్ల క్రితం అంటే 2024లో భజే వాయువేగం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.. అందుతున్న సమాచారం ప్రకారం.. కొత్త సినిమా గురించి ఇప్పుడే ప్రకటించకుండా డైరెక్ట్ గా టీజర్ తోనే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని భావిస్తున్నట్లు మరో వార్త వినిపిస్తుంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

మొత్తానికి కార్తికేయ సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఆయన త్వరలోనే ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఆశిద్దాం. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.