|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కత్రినా-విక్కీ కౌశల్ కొడుకు పేరు రివీల్! విహాన్ కౌశల్ అంటే అర్థం ఏంటో తెలుసా?

Published: 07-01-2026, 8:45 AM
కత్రినా-విక్కీ కౌశల్ కొడుకు పేరు రివీల్! విహాన్ కౌశల్ అంటే అర్థం ఏంటో తెలుసా?
  • బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేశారు.
  • తమ ముద్దుల కొడుకు పేరు ‘విహాన్ కౌశల్’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
  • విహాన్ చేతి ఫోటో షేర్ చేస్తూ ‘మా కాంతి కిరణం’ అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
  • బిడ్డ ఆలనా పాలన కోసం కత్రినా ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్నారని సమాచారం.

బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ ముద్దుల కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ, అతని పేరు ‘విహాన్ కౌశల్’ అని వెల్లడించారు. కొడుకు చేతి ఫోటో షేర్ చేస్తూ ఎంతో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

కొడుకును పరిచయం చేసిన విక్కీ-కత్రినా

Vicky Kaushal Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటీనటులుగా నటీనటులుగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్ 9వ తేదీ పెద్దల సమక్షంలో రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు గత ఏడాదికి పండంటి మగ బిడ్డ(Baby Boy)కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

పెళ్లయిన నాలుగు సంవత్సరాలకు ఈ దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు .ఈ చిన్నారికి 2025 నవంబర్ 7వ తేదీ కత్రినా జన్మనిచ్చారు. అయితే తనకు కుమారుడు పుట్టిన విషయాన్ని తెలియచేసిన ఈ దంపతులు ఇప్పటివరకు తన కొడుకు ఎలా ఉన్నారు? ఏంటీ? అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. తాజాగా ఈ జంట కొడుకు ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు పేరును కూడా రివీల్ చేశారు. కత్రినా, విక్కీ కౌశల్ (Vicky Kaushal)చేతిలో తమకుమారుడి చేయి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన కొడుకు పేరును రివిల్ చేయడమే కాకుండా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు.

విహాన్ కౌశల్ పేరు వెనుక భావోద్వేగం

ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన కత్రినా దంపతులు .. మా కాంతి కిరణం.. విహాన్ కౌశల్ (Vihan Kaushal)అంటూ తమ కొడుకు పేరును తెలియజేశారు. మేము చేసిన ప్రార్థనలకు సమాధానం దొరికింది మా జీవితం చాలా అందంగా ఉంది ఒక్క క్షణంలో ఈ ప్రపంచం మొత్తం మారిపోయిందని ఈ జంట తమ కొడుకుతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే తన కొడుకు ఫేస్ మాత్రం ఈ జంట రివీల్ చేయలేదు. దీంతో చిన్నారి విహాన్ ఎలా ఉన్నారో చూడాలనే ఆత్రుత కూడా అభిమానులలో కలుగుతుంది. ఇక చిన్నారికి విహాన్ కౌశల్ అనే నామకరణం చేయడంతో వీరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానుల ఆనందం.. భవిష్యత్ ప్రణాళికలు

ఇక కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత పలు సినిమాలలో నటించారు కానీ ఇటీవల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ఈమె ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చారు . ఇక విక్కీ కౌశల్ సినిమా విషయానికి వస్తే ఈయన ఛావా సినిమాతో గత ఏడాది ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం తన తదుపరి సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక కత్రినా కైఫ్ తెలుగులో కూడా మల్లీశ్వరి,అల్లరి పిడుగు వంటి సినిమాలలో నటించారు ఈ సినిమాలో తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

విహాన్ కౌశల్ రాకతో విక్కీ-కత్రినా దంపతుల జీవితం మరింత అందంగా మారిందని వారి పోస్ట్ ద్వారా స్పష్టమైంది. చిన్నారి విహాన్ ముఖం చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ స్టార్ కిడ్ భవిష్యత్తుపై అందరి దృష్టి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.