|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కీర్తి సురేష్ భర్తతో రొమాంటిక్ డ్యాన్స్: ‘చమ్మీల అంగీ’ పాటతో నెట్టింట రచ్చ!

Published: 22-12-2025, 8:04 AM
కీర్తి సురేష్ భర్తతో రొమాంటిక్ డ్యాన్స్: 'చమ్మీల అంగీ' పాటతో నెట్టింట రచ్చ!
  • కీర్తి సురేష్, ఆంటోని తటిల్‌లు ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు.
  • నూతనంగా బ్లాక్ అవుట్ ఫిట్ లో పార్టీకి హాజరైన ఈ జంట రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశారు.
  • ‘చమ్మీల అంగిలేసి’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
  • పార్టీలో పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో ఫోటోలు దిగలేదనే క్యాప్షన్ తో పోస్ట్ వైరల్ అయింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్త ఆంటోని తట్టిల్‌తో కలిసి బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిశారు. ఓ పార్టీలో ‘చమ్మీల అంగిలేసి’ పాటకు డ్యాన్స్ చేస్తూ రొమాంటిక్ క్షణాలను పంచుకున్నారు. ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితం: ఆంటోని తట్టిల్‌తో బంధం

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కీర్తి తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో కీర్తి అండ్ ఆమె భర్త ఆంటోని తటిల్ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి ఒక పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

బ్లాక్ అవుట్ ఫిట్ లో కీర్తి-ఆంటోని రొమాంటిక్ ఫోటోలు

అంతేకాకుండా వీరిద్దరు తీసుకున్న కొన్ని రొమాంటిక్ పిక్స్‌తో పాటు చమ్మీల అంగీ వేసి అనే పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు. ‘మీరు మ్యారేజ్‌లో చాలా ఎంజాయ్ చేసి.. చాలా సేపు తర్వాత వధూవరులతో ఫొటో దిగలేదని గ్రహించినప్పుడు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుడు పెళ్లి కూతురితో ఏం పని వెళ్ళామా తిన్నామా ఎంజాయ్ చేశామా అన్నట్లు ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘చమ్మీల అంగిలేసి’ పాటకు వైరల్ డ్యాన్స్: అభిమానుల ప్రశంసలు

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

కీర్తి సురేష్, ఆంటోనిల ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లోని రొమాంటిక్ ఫోటోలు, ‘చమ్మీల అంగిలేసి’ పాటతో చేసిన వైరల్ డ్యాన్స్ వీడియో అభిమానులను అలరించింది. వారి అన్యోన్యత, సరదా వ్యక్తిత్వాన్ని చాటే ఈ క్షణాలు నెట్టింట సంచలనం సృష్టించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.