
📌 Key Points
- కెన్ కరునాస్ హీరోగా, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్’.
- ఈ సినిమా మార్చి 26న తెలుగులో విడుదల కానుంది.
- సినిమాతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ కెన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
- ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీశానని కెన్ తెలిపారు.
కెన్ కరునాస్ హీరోగా నటించిన ‘యూత్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. సినిమాతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కెన్ కరునాస్ ‘యూత్’ మూవీ విడుదల
Ken Karunaas: కెన్ కరునాస్ (Ken Karunaas) హీరోగా నటించిన తమిళ మూవీ ‘యూత్’ (Youth Movie). ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందివ్వబోతున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. మార్చి 26న ఈ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో హీరో కమ్ డైరెక్టర్ కెన్ కరునాస్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఇక పనిచేయడం లేదనే ఆలోచననే నమ్మలేకపోతున్నానని ఆయన చేసిన పోస్ట్ (Ken Karunaas Post) ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు కెన్ తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..
‘‘సినిమా.. నేను దీనితో ప్రేమలో పడిన రోజు నుండి, అదే నాకు అన్నీ అన్నట్లుగా మారిపోయింది. సినిమా తర్వాతే నాకు మిగతావన్నీ ప్రధానంగా మారాయి. ఇది నేను కేవలం చూసింది మాత్రమే కాదు.. నేను జీవించిన ప్రపంచం. నాకు ఇప్పుడు 24 ఏళ్లు.. కానీ నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు, నాతో పాటు నిలిచిన ఏకైక తోడు సినిమానే. ప్రతి దశలోనూ, ప్రతి సందేహంలోనూ, ప్రతి చిన్న కలలోనూ.. సినిమా నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇకపై నేను ‘యూత్’ సినిమా కోసం పని చేయలేనంటే నమ్మలేకపోతున్నాను. చాలా కాలం పాటు, ఇది నా సొంత బిడ్డలా అనిపించింది. ప్రతిరోజూ దీని గురించే ఆలోచిస్తూ నిద్రలేవడం, నిద్రపోవడం చేసేవాడిని. ఒక హీరోగా, నేను ఒక అందమైన కథలో జీవించాను. ఒక దర్శకుడిగా, నేనేంటో కనుగొన్నాను. ప్రతి ఫ్రేమ్‌కు నా హార్ట్ పెట్టేశాను, ప్రతి క్షణం నా ప్రయాణంలో ఒక భాగాన్ని మోస్తోంది. ఇది నన్ను బాధ పెట్టిన రోజులున్నాయి, నన్ను నిలబెట్టిన రోజులున్నాయి. కానీ నేను అసలు ఎందుకు మొదలుపెట్టానో ఇది ఎప్పుడూ నాకు గుర్తు చేస్తూనే ఉంది.
సినిమాతో కెన్ కరునాస్ అనుబంధం
మిమ్మల్ని (ప్రేక్షకులను) మనసులో పెట్టుకునే నేను ఈ సినిమా తీశాను. మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎక్కడ నవ్వుతారు, ఎక్కడ కనెక్ట్ అవుతారు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎంతో మంది మంచి వ్యక్తులు కలిసి దీనిని సాధ్యం చేశారు. వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఇక ఇప్పుడు దీనిని వదిలిపెడుతున్నాను. ఇప్పటి వరకు నాదిగా ఉన్నది.. ఇకపై మీది కాబోతోంది. దీనిని జాగ్రత్తగా చూసుకోండి.. నేను ప్రేమించినట్టే ప్రేమించండి.. బహుశా అంతకంటే ఎక్కువే ప్రేమిస్తారని ఆశిస్తున్నాను. ఇది మిమ్మల్ని అలరిస్తుందని, మీతోనే ఉండిపోతుందని, మీరు దాచుకోవడానికి ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఎంతగానో ఆశిస్తున్నాను. కేవలం సినిమాను ప్రేమించిన ఒక పిల్లాడి నుండి.. ఈ క్షణం వరకు.. వదిలిపెట్టడం కష్టమే.. కానీ ఇది మీ దగ్గరికి చేరుతుందనే విషయం దీనిని మరింత అందంగా మారుస్తోంది.. థియేటర్లలో కలుసుకుందాం’’ అంటూ కెన్ కరునాస్ తన సినీ జర్నీని తెలుపుతూ ఎమోషనల్‌గా ఈ పోస్ట్‌లో రియాక్ట్ అయ్యారు.
From the day I fell in love with it, everything else slowly became secondary ❤️ It wasn’t just something I watched… it became something I lived …🥹
వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్
I’m just 24… but from my childhood till now, this is the only thing that stayed with me… Through every phase, every… pic.twitter.com/gq7uvHl6t8
— Ken Karunaas (@KenKarunaas) March 18, 2026
కెన్ కరునాస్ తన సినిమాను ప్రేక్షకులందరికీ అంకితం చేస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. ‘యూత్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.


