|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published: 14-06-2025, 2:43 AM
'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

మలయాళంలో తెరకెక్కిన ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌: ది సెర్చ్‌ ఫర్‌ సీపీవో అంబిలి రాజు’ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. జూన్ 20న జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Key Points

1

జూన్ 20న జియో హాట్‌స్టార్‌లో 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2' స్ట్రీమింగ్ ప్రారంభం.

2

అజు వర్గీస్‌, లాల్‌, నివాస్‌ వాలిక్కున్ను వంటి నటుల నటన.

4

క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సీజన్‌లో పలు మర్డర్ కేసుల రహస్యాలు.

‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2’ విడుదల తేదీ

మలయాళంలో తెరకెక్కిన ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌: ది సెర్చ్‌ ఫర్‌ సీపీవో అంబిలి రాజు’ (kerala crime files season 2) నుంచి మరో  ట్రైలర్‌ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.  2023లో జియో హాట్‌స్టార్‌ వేదికగా ‘కేరళ క్రైమ్ ఫైల్స్‌’ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అహ్మద్‌ కబీర్‌  తెరకెక్కించాడు. పార్ట్‌ 1లో ఒక్క మర్డర్‌ కేసుకు సంబంధించి  చూపించాడు.   పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు.

ఇప్పుడు పార్ట్‌2 కూడా  క్రైమ్‌ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్‌ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది.  అజు వర్గీస్‌, లాల్‌,నివాస్‌ వాలిక్కున్ను, జిన్జ్‌ షాన్‌, శ్రీజిత్‌ వంటి వారు ఇందులో నటించారు. జూన్‌ 20న జియోహాట్‌స్టార్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడలో కూడా స్ట్రీమింగ్‌ కానుంది.

నటీనటులు మరియు సినిమా వివరాలు

భాషలు మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

మొత్తంగా, ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2’ క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులకు ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 20న జియో హాట్‌స్టార్‌లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.