
📌 Key Points
- కేరళ ఎన్నికల ప్రచారంలో కేరళ సీఎం విజయన్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు.
- తెలంగాణ, కేరళ రాష్ట్రాల సీఎంల పాలనలో అవినీతి, కుటుంబ పాలన పోలికలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణ.
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సీఎం విజయన్, అవి నిరాధారమైనవని పేర్కొన్నారు.
- పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి నీతులు చెప్పడం విడ్డూరమని రేవంత్ రెడ్డిపై విజయన్ ఫైర్.
కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం పినరయి విజయన్‌పై ఆయన చేసిన విమర్శలకు విజయన్ గట్టిగా బదులిచ్చారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
రేవంత్ రెడ్డి కేరళ సీఎంపై విమర్శలు
కేరళలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతున్నాయి. అయితే ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో మాట్లాడిన ఆయన… సీఎం పినరయి విజయన్ ను టార్గెట్ చేశారు.కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ కూడా మాట్లాడారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ కు… తెలంగాణను పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానిచంారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒక్కటేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విమర్శలకు సీఎం విజయన్ కౌంటర్ ఎటాక్
ఇక కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రం గురించి ఇటీవల చేసిన అవమానకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి…. కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని దుయ్యబట్టారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి ఆయన కేవలం ఒక గొంతుకగా మారిపోయారని కౌంటర్ ఇచ్చారు.
ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మొత్తానికి, కేరళ ఎన్నికల వేళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం రాజకీయంగా వేడిని రాజేసింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


