
📌 Key Points
- యువ నటుడు రాకేష్ జాగర్లమూడి ‘ఖుదీరాం బోస్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
- పాత్ర కోసం 90 రోజుల కఠిన శిక్షణతో పాటు చారిత్రక అధ్యయనం చేశారు.
- ఖుదీరాం బోస్ పాత్ర తనలో భయాన్ని పోగొట్టి, సత్యం కోసం నిలబడే ధైర్యాన్ని పెంచింది.
- ‘ఖుదీరాం బోస్’ చిత్రం Waves యాప్‌లో తెలుగుతో సహా పలు భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉంది.
యువ నటుడు రాకేష్ జాగర్లమూడి ‘ఖుదీరాం బోస్’ చిత్రంలో విప్లవ వీరుడి పాత్ర పోషించిన అనుభవాలను పంచుకున్నారు. ఆ పాత్ర తనను ఎలా మార్చిందో, దేశం కోసం చేసిన త్యాగాలను ఆదరించాలని ఆయన ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. ఈ చిత్రం ‘Waves’లో ఉచితంగా అందుబాటులో ఉంది.
‘ఖుదీరాం బోస్’ పాత్ర: అదృష్టం, బాధ్యత
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ‘ఖుదీరాం బోస్’(Khudiram Bose). ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి (Rakesh Jagarlamudi)తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. నిజం చెప్పాలంటే, ఈ కథ వింటున్నంత సేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ఒక బాలుడు దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీరుడి పాత్రను నేను పోషించబోతున్నానని తెలియగానే ఒక పక్క గర్వంగా, మరోపక్క పెద్ద బాధ్యతగా అనిపించింది. మా నాన్న వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. ఒక రకంగా ఈ పాత్ర నాకు సులభంగానే దక్కినప్పటికీ, దానికి న్యాయం చేయడం కోసం నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 90 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాను. ‘మయూఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్’లో సీనియర్ నటుడు ఉత్తేజ్ గారి దగ్గర నటనలో మెరుగులు దిద్దుకున్నాను. ఉత్తేజ్ గారి భార్య పద్మగారు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. దాంతో పాటు చారిత్రక పుస్తకాలు చదివి, ఆ కాలం నాటి బాడీ లాంగ్వేజ్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.
ఉరికంబం ఎక్కే సన్నివేశం నన్ను బావోద్వేగానికి గురి చేసింది. 18 ఏళ్ల వయసులో మరణం కళ్లముందు కనిపిస్తున్నా, దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు కలిగిన భావం నాలో చాలా రోజుల వరకు ఉండిపోయింది. ఆ పాత్ర తర్వాత నాలో భయం పోయి, సత్యం కోసం నిలబడాలనే ధైర్యం పెరిగింది. ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఇదే. దేశభక్తి అనేది కేవలం మాటల్లో కాదు, మనం చేసే పనిలో ఉండాలి. ‘ఖుదీరాం బోస్’ లాంటి సినిమాలు వందకి ఒకటి వస్తాయి. మన చరిత్రను, వీరుల త్యాగాలను గౌరవించడం మన బాధ్యత. ఈ చిత్రం భారత ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారం ‘Waves’ (వేవ్స్) లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుండి ‘Waves’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉచితంగా చూడవచ్చు. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. దయచేసి అందరూ చూసి మన చరిత్రను ఆదరించండి’’ అని అన్నారు.
పాత్ర కోసం కఠిన శిక్షణ, పరిశోధన
మన చరిత్రను గౌరవించండి: రాకేష్ పిలుపు
ఖుదీరాం బోస్ పాత్ర తనలో స్ఫూర్తిని నింపిందని రాకేష్ జాగర్లమూడి తెలిపారు. దేశభక్తిని చేతల్లో చూపాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రక చిత్రాన్ని ‘Waves’ యాప్‌లో ఉచితంగా చూసి మన చరిత్రను గౌరవించాల్సిందిగా కోరారు.


