
📌 Key Points
- తల్లి అయిన తర్వాత తొలి ఆరు నెలలు నరకం చూశానని కియారా అద్వానీ వెల్లడి.
- ఈ కష్ట సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండగా నిలిచారని తెలిపింది.
- మాతృత్వం తనను తాను అర్థం చేసుకోవడానికి, ప్రేమించుకోవడానికి కీలక మలుపు.
- బిడ్డ పుట్టిన తర్వాత చిన్న విషయాలకే ఏడ్చేదాన్నని, సిద్ధార్థ్ తనను బయటకు తీసుకెళ్లేవాడని చెప్పింది.
బాలీవుడ్ అగ్రతార కియారా అద్వానీ తల్లిగా మారిన తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను భావోద్వేగంగా పంచుకున్నారు. బిడ్డ పుట్టిన తొలి ఆరు నెలలు నరకం చూశానని, ఆ సమయంలో తన మానసిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తల్లిగా కియారా తొలి ఆరు నెలల పోరాటం
Kiara Advani: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కియారా అద్వానీ (Kiara Advani)ఒకరు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించినప్పటికీ తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాలలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇటీవలే కియారా తల్లిగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈమె గత ఏడాది జులై నెలలో తన బిడ్డ సారయాకు జన్మనిచ్చారు.
ఒక బిడ్డ తల్లి అయినప్పటికీ కియారా అందంలో ఏమాత్రం తీసిపోకుండా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా పాప పుట్టిన తర్వాత ఆరు నెలలపాటు తన మానసిక పరిస్థితి గురించి, ఈమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.. బిడ్డ పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలియజేశారు. పాప జన్మించిన తరువాత మొదటి ఆరు నెలలు నాపై నాకు జాలి చూపించుకోవడానికి కూడా కష్టంగా అనిపించేదని తెలిపారు.
మాతృత్వం నేర్పిన జీవిత పాఠాలు
ఆ ఆరు నెలల పాటు తాను నరకం ఏంటో చూశాను. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించి నేను మొట్టమొదటిసారి నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలు పెట్టాను. నాకంటూ కొంత సమయం కేటాయించుకోవాలని గ్రహించాను. నాలో భావాలను అర్థం చేసుకోవడానికి నన్ను నేను ప్రేమించుకోవడానికి ఈ మాతృత్వం తనకు ఒక కీలక మలుపుగా మారిందని తెలియజేశారు. అయితే తాను ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) తనకంటూ ఎంతో సమయం కేటాయించారని తెలిపారు.
పాప పుట్టిన తర్వాత నేను చిన్న చిన్న విషయాలకే చాలా బాగా ఏడ్చేదాన్ని. అయితే సిద్దార్థ్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు రాత్రి మా అమ్మ ఇంటికి వచ్చి నన్ను బయటకు తీసుకెళ్లేవాడు డాక్టర్ చెప్పిన సలహాలు అన్నింటిని కూడా పాటించేవారు. నా కష్ట సమయంలో తన భర్త మద్దతు చాలా బాగా లభించింది అంటూ ఈమె తెలియజేశారు. ఇక కియారా సిద్ధార్థ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2023వ సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కారు 2025 సంవత్సరంలో మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఇలా పాప పుట్టినప్పటికీ ఈమె మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపారు. ప్రస్తుతం కియారా సినిమాల విషయానికి వస్తే గీతూ మోహన దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన టాక్సిక్ (Toxic) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
సిద్ధార్థ్ మల్హోత్రా అండదండలు
కియారా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ద్వారా మాతృత్వంలోని కష్టాలను, భర్త మద్దతు ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆమె ధైర్యం అనేక మంది తల్లులకు స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు.


