|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిచ్చా సుదీప్ షాకింగ్ నిజం: డబ్బుల్లేకుండా చేశా.. అయినా నాకు ఒక్కరూ సపోర్ట్ ఇవ్వట్లేదు!

Published: 28-12-2025, 8:16 AM
కిచ్చా సుదీప్ షాకింగ్ నిజం: డబ్బుల్లేకుండా చేశా.. అయినా నాకు ఒక్కరూ సపోర్ట్ ఇవ్వట్లేదు!
  • కిచ్చా సుదీప్ ఇతర భాషా చిత్రాల్లో డబ్బులు తీసుకోకుండా నటించినట్లు వెల్లడి.
  • కన్నడ సినిమాలకు ఇతర స్టార్ హీరోల నుండి మద్దతు కరువైందని సుదీప్ ఆవేదన వ్యక్తం.
  • తాను బ్రిడ్జ్‌లా పనిచేయాలనుకున్నా, కానీ పూర్తి స్థాయిలో స్పందన లేదని సుదీప్ వ్యాఖ్య.
  • ఇండస్ట్రీల మధ్య సహకారం పెరగాలంటే పెద్ద హీరోల పాత్ర చాలా కీలకమని అభిప్రాయం.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను ఇతర భాషల్లో డబ్బులు తీసుకోకుండా నటించినా, కన్నడ సినిమాలకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల మధ్య సహకారం కొరవడిందని ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

సుదీప్ ఆవేదన: డబ్బుల్లేకుండా నటించినా…

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichcha Sudeep), సినిమాలు, బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోల చిత్రాల్లో విలన్‌గా గెస్ట్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ చేసిన కిచ్చా సుదీప్ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను రాబట్టుకున్నాడు. అయితే తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పలు విభిన్న పాత్రలు చేస్తూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు మాత్రం తనకు అండగా నిలబడం లేదని చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రల్లో నటించాం.

కన్నడ చిత్రాలకు మద్దతు కరువైంది

కాకపోతే అయా భాషల స్టార్స్ మాత్రం కన్నడ హీరోలకు సపోర్ట్ చేయడం లేదు. కన్నడ సినిమాలకు సపోర్ట్ దొరకడం లేదు. మా చిత్రాల్లో నటించేందుకు కొందరు ఆసక్తి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇతర భాషల్లో చేసిన సినిమాలకు డబ్బులు కూడా తీసుకోకుండా నటించినట్లు చెప్పాడు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని తన మూవీలో అతిథి పాత్రలో చేయమని అడిగినప్పటికీ.. వాళ్లు అంగీకరించడం లేదని అన్నాడు. ఇది ఇరువైపులా జరగాల్సిన ప్రయత్నం.. కానీ ప్రస్తుతం అది జరుగుతున్నట్లు నాకు కనిపించడం లేదన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇండస్ట్రీ సహకారంపై సంచలన వ్యాఖ్యలు

కన్నడ సినిమాలకు సరైన మద్దతు, గుర్తింపు రావాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నానని, అందుకే ఇతర భాషల్లో నటిస్తూ బ్రిడ్జ్‌లా పనిచేయాలనుకున్నానని సుదీప్ అన్నారు. అయితే ఆ ప్రయత్నానికి పూర్తి స్థాయిలో స్పందన లేకపోవడం తనను బాధపెడుతోందని వెల్లడించారు. ఇండస్ట్రీల మధ్య గ్యాప్ తగ్గాలంటే పెద్ద హీరోల స్థాయిలో సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. . కొందరు అభిమానులు ఆయన మాటలకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఇతర ఇండస్ట్రీల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

సుదీప్ వ్యాఖ్యలు సినీ ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవైపు అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా, మరోవైపు ఇండస్ట్రీల మధ్య సహకారం ఆవశ్యకతపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.