|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కింగ్డమ్’ నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. బ్రదర్ సెంటిమెంట్‌తో హార్ట్ టచ్ చేసేశారుగా..

Published: 16-07-2025, 11:58 PM
‘కింగ్డమ్’ నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. బ్రదర్ సెంటిమెంట్‌తో హార్ట్ టచ్ చేసేశారుగా..

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా నుంచి రెండవ సింగిల్ ప్రోమో విడుదలైంది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ, ఈ పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ పాటకు ప్రత్యేకత.

Key Points

1

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన 'కింగ్డమ్' సినిమా నుంచి రెండో సింగిల్ ప్రోమో విడుదల.

2

'అన్న అంటేనే' అనే భావోద్వేగ గీతం అన్నదమ్ముల బంధాన్ని చూపిస్తుంది.

4

జూలై 31న 'కింగ్డమ్' సినిమా విడుదల కానుంది.

‘కింగ్డమ్’ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కింగ్డమ్’(Kingdom). ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి(Gowtham Thinnanoori) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasre Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. హీరో సత్యదేవ్(Satyadev) కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక ఈ చిత్రం జూలై 31న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రూతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. ‘కింగ్‌డమ్’ కోసం ‘అన్న అంటేనే’ అనే భావోద్వేగ గీతాన్ని స్వరపరచగా.. కృష్ణకాంత్‌ సాహిత్యాన్ని అందించారు. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇందులో విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ సోదరులుగా కనిపించారు. Link

అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించే పాట

అనిరుధ్ రవిచందర్ సంగీతం

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటనతో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సెకండ్ సింగిల్ ప్రోమో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.