
📌 Key Points
- ‘క’ మూవీ సీక్వెల్‌లో కిరణ్ అబ్బవరం ఉండకపోవచ్చు: నిర్మాత షాకింగ్ ప్రకటన!
- 2027 జనవరిలో ‘క’ సీక్వెల్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడి
- సందీప్-సుజీత్ ద్వయం దర్శకత్వంలో సీక్వెల్.. హీరో మార్పుపై సంచలన నిర్ణయం!
- ‘క’ సినిమా క్లైమాక్స్‌లో హింట్ ఉన్నప్పటికీ హీరో మార్పు అభిమానులకు షాక్ కలిగిస్తోంది.
కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ‘క’ మూవీ ఒక మైలురాయిగా నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.
2027లో ‘క’ సీక్వెల్ విడుదల?
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక కాంబోలో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సందీప్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీనిశ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మొదటి పార్ట్ క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఏడాది అవుతున్నప్పటికీ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో కిరణ్ అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా.. ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత చింతా గోపాలకృష్ణ (Chinta Gopalakrishna)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
సినిమా సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అన్న ప్రశ్నకు నిర్మాత స్పందిస్తూ.. “సీక్వెల్‌ను 2027 జనవరిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి భాగాన్ని తెరకెక్కించిన సందీప్-సుజీత్ జంటే ఈ ప్రాజెక్ట్‌ను కూడా హ్యాండిల్ చేస్తారు. అయితే, హీరో విషయంలో మాత్రం దర్శకుల నిర్ణయమే ఫైనల్. కథ డిమాండ్ చేస్తే కిరణ్ అబ్బవరంకు బదులుగా వేరే హీరోతో కూడా వెళ్లే అవకాశం ఉంది” అని బాంబు పేల్చారు. ఈ చిత్రంతో హిట్ అందుకోవాలని చూస్తున్న కిరణ్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. సీక్వెల్‌లో హీరో మారుతారేమో అన్న నిర్మాత వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరంకు, నిర్మాతకు మధ్య ఏవైనా గొడవలు జరిగాయా? లేక కథా పరంగా మార్పులు చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘క’ సినిమా క్లైమాక్స్ చూసిన వారు మాత్రం, కిరణ్ పాత్ర లేకుండా సీక్వెల్ ఊహించుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.
హీరోగా కిరణ్ అబ్బవరం ఉంటారా?
నిర్మాత సంచలన ప్రకటన!
నిర్మాత చేసిన ఈ ప్రకటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ మాత్రం సీక్వెల్‌లో తమ హీరో ఉండాలని కోరుకుంటున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


