|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ ఘటన తర్వాత గంటలోనే అన్నయ్య మరణించారు: కిరణ్‌ అబ్బవరం

Published: 22-09-2025, 1:52 AM
ఆ ఘటన తర్వాత గంటలోనే అన్నయ్య మరణించారు: కిరణ్‌ అబ్బవరం

నటుడు కిరణ్ అబ్బవరం తన అన్నయ్య మరణించిన విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆయన వివరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

Key Points

1

కిరణ్ అబ్బవరం అన్నయ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.

2

ఈ ఘటన తర్వాత కిరణ్ అబ్బవరం డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండటం ప్రారంభించారు.

4

హెల్మెట్ ధరించి, బాధ్యతాయుతంగా వాహనం నడపాలని కిరణ్ అబ్బవరం యువతను కోరారు.

అన్నయ్య రోడ్డు ప్రమాదం

‘కాలేజీ చదివే రోజుల్లో అల్లరిచిల్లరగా తిరిగా.. ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు.. రోడ్డు ప్రమాదంలో మా అన్నను కోల్పోయిన తర్వాతే రహదారి భద్రతకు ఉండే ప్రాధాన్యత అర్థమైంది’ అని సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం అన్నారు. అప్పటి నుంచి బాధ్యతగా వాహనాన్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జలవిహార్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ట్రాఫిక్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌–2025 ముగింపు వేడుకలు. వీటికి కిరణ్‌ అబ్బవరం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

రోడ్డు భద్రతపై అవగాహన

‘డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా చెబుతుంటే.. సోది అనుకునేవాడిని.. ఓ రోజు సాయంత్రం మా అన్నతో చాలాసేపు గడిపా.. పల్లెలో ఇల్లు కట్టుకోవాలని, అది అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ చర్చించుకున్నాం. ఇది జరిగిన గంటకే అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త వినాల్సి వచి్చంది. అప్పటి నుంచి నాకూ భయం పట్టుకుంది. అప్పటి వరకూ కారు ఎక్కితే చాలు దూసుకుపోవాలని, గంటకు 140 కిలోమీటర్ల స్పీడ్‌ టచ్‌ కావాలని భావించే వాడిని. బంజారాహిల్స్‌లో చెకింగ్స్‌ జరుగుతున్నాయని తెలిస్తే జూబ్లీహిల్స్‌ మీద నుంచి దూసుకుపోయేవాడిని’ అన్నారు.

కిరణ్ అబ్బవరం సందేశం

‘ఇప్పుడు ప్రతిక్షణం అప్రమత్తంగా డ్రైవ్‌ చేస్తున్నా. మనం బతకాలి, ఎదుటి వారిని బతికించాలి అనే ఉద్దేశంతో పూర్తి బాధ్యతగా డ్రైవింగ్‌ చేస్తున్నా. అన్న ఉదంతం తర్వాతే ఏదైనా ప్రమాదంలో ఓ ప్రాణం ఆ కుటుంబానికి ఎంత అవసరమో తెలిసింది. ఎవరైనా చెప్తే ఆ విషయం మన మనసులో ఎక్కువ కాలం ఉండదు. అదే మన మనసులో మెదిలితే మాత్రం సుదీర్ఘకాలం ఉండిపోతుంది. అందుకే ట్రాఫిక్‌ రూల్స్‌ విషయంలో అందరం మనస్ఫూర్తిగా మారదాం. నేటి తరం యువకు నేను చెప్తున్నది ఒక్కటే.. ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ కచ్చితంగా ధరించండి. మీతో పాటు ఎదుటి వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని నడపండి. ఇంటి నుంచి వాహనం  బయటకు తీసిన క్షణం నుంచే దీన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా మెలగాలి’ అని పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తగా వాహనాలు నడపడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.