
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డైరెక్టర్ కౌశిక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచాయి.
Key Points
కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదలవుతోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి 10 నిమిషాల్లోనే ప్రేక్షకులు ఫోన్లు పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తానని చెప్పాడు.
డైరెక్టర్ కౌశిక్, సినిమా చాలా బాగుందని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నమ్మకంతోనే సినిమా పూర్తయిందని అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కిష్కింధపురి విడుదల తేదీ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది . ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు .
కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ ..’ మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను . అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది . ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం . అస్సలు కంగారు లేదు .. మూవీ చాలా బాగా వచ్చింది . ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది . నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు .. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు .. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్ లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది . కచ్చితంగా డిస్టింక్షన్ లో పాసవుతామనే నమ్మకం ఉంది ‘ అని అన్నారు .
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్
డైరెక్టర్ కౌశిక్ అభిప్రాయం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి వ్యాఖ్యలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కిష్కింధపురి సినిమా విజయవంతం అవుతుందని అంచనాలు ఉన్నాయి.


