|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Klin Kaara Birthday: క్లీంకార పేరే పులిపిల్లకు కూడా.. ఉపాసన పోస్ట్

Published: 20-06-2025, 3:51 AM
Klin Kaara Birthday: క్లీంకార పేరే పులిపిల్లకు కూడా.. ఉపాసన పోస్ట్

మెగాస్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార రెండవ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన చేసిన ఒక ప్రత్యేకమైన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

రామ్ చరణ్ కూతురు క్లీంకారకు రెండవ పుట్టినరోజు వేడుకలు.

2

ఉపాసన, హైదరాబాద్ నెహ్రూ జూలోని పులి పిల్లకు కూతురి పేరు పెట్టారు.

4

ఈ కార్యక్రమం మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

క్లీంకార రెండో పుట్టినరోజు వేడుకలు

మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన ఓ మంచి నిర్ణయం తీసుకుంది. తన కూతురి పేరుని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో ఉన్న ఓ పులి పిల్లకు పెట్టింది. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి కూడా కూతురి పేరు పెట్టడం విశేషం.

2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం. తర్వాత కెరీర్ పరంగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జూన్ 20న ఉపాసనకు కూతురు పుట్టింది. పాపకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు చాలాసార్లు పాపతో తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేశారు కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

పులిపిల్లకు కూతురి పేరు

ఇప్పుడు కూడా జూలోని పులిని దత్తత తీసుకుని, కూతురు పేరు దానికి పెట్టామని చెప్పిన ఉపాసన క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. ‘ఏడాది క్రితం ఈ పులిపిల్ల ఓ పసికూన. ఇప్పుడు శివంగిలా మారి క్లీంకార కలిసి పేరుని పంచుకుంది. ఈ విషయంలో హైదరాబాద్ జూ నిర్వహకులకు థ్యాంక్యూ. క్రూరమృగాలు అడవిలో ఉండాలి. కానీ అవి కూడా గౌరవంతో బతకాలి’ అని ఉపాసన రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా అభిమానులకు నచ్చేస్తోంది.

ఉపాసన సోషల్ మీడియా పోస్ట్

చరణ్ సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గేమ్ ఛేంజర్ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. కానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘పెద్ది’ చేస్తున్నాడు. బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం రిలీజైన గ్లింప్స్ వీడియో ఆకట్టుకోవడమే ఇందుకు కారణం.

ఉపాసన తన కూతురు పేరును పులిపిల్లకు పెట్టడం ద్వారా ప్రకృతి పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఈ చర్య మెగా అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.