
📌 Key Points
- ‘దండోరా’ చిత్రం నవంబర్ 25న విడుదలై పాజిటివ్ టాక్ పొందింది.
- తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాను వీక్షించి ప్రశంసించారు.
- గ్రామీణ జీవనశైలి, సామాజిక అంశాలను సహజంగా చూపించిందని మంత్రి కితాబు.
- ‘బలగం’ తర్వాత తన మనసును తాకిన సినిమాగా ‘దండోరా’ను అభివర్ణించారు.
నటులు శివాజీ, నదదీప్, నందు నటించిన ‘దండోరా’ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సినిమాను వీక్షించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బలగం’ సినిమా స్థాయిలో ‘దండోరా’ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దండోరాకు అద్భుత స్పందన
శివాజీ, నదదీప్, నందు, బిందూ మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండోరా(Dandora Movie). ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరూ ఊహించిన విధంగానే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా ‘దండోరా’. ‘బలగం’ తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా ‘దండోరా’. వినోదంతో పాటు విలువైన సందేశం అందించిన దండోరా టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు’’ కోమటిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
బలగంతో దండోరా పోలిక ఎందుకు?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసలతో ‘దండోరా’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. గ్రామీణ నేపథ్యం, సామాజిక సందేశంతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది.


