
టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సమస్యపై స్పందించారు. దిల్ రాజుతో చర్చించిన తర్వాత ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
Key Points
టాలీవుడ్ సినిమా కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కార్మికులతో మాట్లాడనున్నారు.
టాలీవుడ్ లో సమ్మె తీవ్రం
Komatireddy Venkat Reddy : టాలీవుడ్ లో ప్రస్తుతం అనధికార సమ్మె నడుస్తుంది. ఏకంగా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. పలువురు నిర్మాతలు నేడు చిరంజీవిని కలిసి ఈ సమస్య గురించి కూడా మాట్లాడారు.
కోమటిరెడ్డి స్పందన
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ టాలీవుడ్ సమ్మెపై స్పందించారు. కోమటిరెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత నేను కార్మికులతో మాట్లాడతాను. కార్మికుల అంశాలు తెలుసుకొని పరిశీలించాలని దిల్ రాజుకు సూచించాను. ఆయన దీనిపై చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు.
దిల్ రాజుతో చర్చలు
టాలీవుడ్ సమ్మె పరిష్కారం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేస్తున్నారు. కార్మికులతో చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన భావిస్తున్నారు.


