
📌 Key Points
- కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించిన ‘బ్యాండ్ మేళం’ సినిమాపై విమర్శలు.
- సినిమా కోసం మ్యాంగో రామ్ రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం.
- కోన వెంకట్ సినిమాను తక్కువ బడ్జెట్లో పూర్తి చేసి డబ్బు వెనకేశారని ఆరోపణలు.
- నిర్మాతల మధ్య వివాదం పరిష్కరించడానికి బెక్కెం వేణుగోపాల్ రంగంలోకి దిగినట్లు సమాచారం.
రైటర్ కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ఆర్ధిక వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మ్యాంగో రామ్ అనే వ్యక్తి 5 కోట్లు పెట్టుబడి పెట్టగా, కోన డబ్బు వెనకేశాడని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్యాండ్ మేళం సినిమాపై విమర్శలు
kona venkat: కోన వెంకట్ ..డీ ,రెడీ ,దూకుడు వంటి సినిమాలతో కమర్షియల్ ఫార్ములాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ స్టార్ రైటర్ తాజాగా ప్రొడ్యూస్ చేసిన సినిమా బ్యాండ్ మేళం.కోర్టు’ సినిమాతో ఆకట్టుకొన్న జంట ఈ సినిమాలో మళ్లీ జట్టు కట్టగా లేటెస్ట్ గా థియేటర్ లలోకి వచ్చిన ఈ సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.
సినిమా ఆడకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు
కోన వెంకట్‌పై ఆర్ధిక ఆరోపణలు
ఇక కోన ఏకంగా ఈ సినిమా ఆడకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అంటూ నాని రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో కొంపదీసి కోన హిట్ కొడతాడా ఏంటి అన్న డౌట్స్ కూడా వచ్చేశాయ్. ఆడియన్స్ మాత్రం అబ్బే అంత సీన్ లేదంటూ సినిమాని వచ్చిన దారిలోనే సాగనంపే పనిలో పడ్డారు.అయితే ‘కోర్టు’ సినిమా సక్సెస్ అయింది కదాని మళ్ళీ అదే కాంబోలో సినిమా అంటే సూపర్ హిట్ కొట్టొచ్చని ప్లాన్ వేసుకున్న కోన ,కథ కథనాల విషయంలో మాత్రం ఎలాంటి కేర్ తీసుకోలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది.ముఖ్యంగా అవుట్ డేటెడ్ అయిపోయిన బోరింగ్ కామెడీ జోకుల వల్లే సినిమా మటాష్ అయిందన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.
ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్..?
ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాకి అసలు కోన మెయిన్ ప్రొడ్యూసర్ కాదట ,అవును .. దీనికి మ్యాంగో రామ్ బ్యాక్ ఎండ్ లో దాదాపు 5 కోట్లు పెట్టుబడి పెట్టాడని ,అయితే కోన తన అనుభవాన్ని అంతా రంగరించి కేవలం రెండు కోట్లలో సినిమాని చుట్టేసి మిగతా డబ్బు వెనకేశాడని ఇన్ సైడ్ టాక్.అయితే సినిమా ఇపుడు అడ్డంగా పోవడం, చీప్ గా చుట్టేశారన్న టాక్ రావడంతో ఫుల్ ఫైర్ మీద ఉన్నారట మ్యాంగో రామ్, ఇక తాజాగా వీరి మధ్యలో ఉన్న ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎంట్రీ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది. చూస్తుంటే మ్యాంగ్ రామ్ మిగతా మూడు కోట్లు ముట్ట చెప్పేదాకా ఈ వ్యవహారాన్ని అంటా ఈజీగా వదిలేలా లేడన్న గుసగుసలు జోరుగా సాగుతున్నాయ్.
వివాదంలోకి బెక్కెం వేణుగోపాల్ ఎంట్రీ
ఈ న్యూస్ పై కోన వారు ఎలా రియాక్ట్ అవుతారో
వాస్తవానికి సినిమా బాగుంటే ఇవన్ని లెక్కలోకి వచ్చేవి కావేమో..కాని సినిమా డిజాస్టర్ దిశగా సాగుతుండటంతో ఇలా బొక్కలన్ని బయటపడుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది.మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై కోన వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి
సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్, ఆర్ధిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలు కోన వెంకట్ ను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో వేచి చూడాలి.


