
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. ఆయన నటించిన అనేక సినిమాలలో ‘అహ నా పెళ్లంట’ చిత్రం ప్రత్యేకమైనది. ఈ సినిమాలోని ఆయన పాత్ర ఎంపిక విషయంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది.
Key Points
కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు.
'అహ నా పెళ్ళంట' సినిమాలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర కోట గారికి అందరికీ ఇష్టమైనది.
కానీ 'మండలాధీశుడు' సినిమా తర్వాత కోట గారి నటనతో ఆకట్టుకుని ఆ పాత్ర కోట గారికే దక్కింది.
కోట శ్రీనివాసరావు గారి మరణం
తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) ఇవాళ తుదిశ్వాస విడిచారు . కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు . ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ .. వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు . ఆయనలా హాస్యం పండించడం , విలనిజం చూపించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో అన్నంతలా తనలోని విలక్షణ నటనను వెండితెరపై చూపించారు . అయితే ఆయన చేసిన సినిమాల్లో అహ నా పెళ్లంట చిత్రానికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది .
‘అహ నా పెళ్లంట’ లోని లక్ష్మీపతి పాత్ర
ఈ చిత్రంలో ఆయన చేసిన ఓ సీన్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుని గుర్తుండిపోయేలా ఉంటుంది . అది మరేదో కాదు .. కోటా శ్రీనివాసరావు నటించిన అహ నా పెళ్లంట చిత్రంలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర . ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు . ఇందులో కోట తన పాత్రలో ఒదిగిపోయారు . బ్రహ్మానందంతో కలిసి ఆయన పండించిన కామెడీ చూస్తే నవ్వకుండా ఉండలేరు . అంతలా ఆ పాత్రలో మెప్పించారాయన .
పాత్ర ఎంపిక వెనుక కథ
కానీ ఆ పాత్రకు మొదట అనుకున్నది కోటాను కాదట . కథ రాసుకున్నప్పుడు లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట . అయితే అప్పటికే కోటా శ్రీనివాసరావు నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల కావడంతో ఆ రోల్ ను కోటతోనే చేయించాలని జంధ్యాల నిర్ణయించుకున్నారట . కానీ నిర్మాత డి.రామానాయుడు మొదట అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఆ తర్వాత పట్టుబట్టి మరి ఆయనను ఒప్పించారట.
కోట శ్రీనివాసరావు గారి అద్భుతమైన నటన ‘అహ నా పెళ్లంట’ సినిమాకు మరింత ప్రాముఖ్యతను తెచ్చింది. ఆయన తన నటనతో అందరి హృదయాలలో నిలిచిపోతారు.


