|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హీరోయిన్ ని నిజంగానే తన్నారా? ఎన్టీఆర్ సినిమాపై కృష్ణవంశీ సంచలన నిజాలు!

Published: 22-01-2026, 2:05 AM
షాకింగ్: హీరోయిన్ ని నిజంగానే తన్నారా? ఎన్టీఆర్ సినిమాపై కృష్ణవంశీ సంచలన నిజాలు!
  • రాఖీ సినిమాలో సుహాసినిని నిజంగా కాలితో తన్నలేదని స్పష్టం చేసిన కృష్ణవంశీ.
  • ఎన్టీఆర్ డైలాగ్ మెమొరీ అద్భుతం, లెన్తీ డైలాగ్స్ కూడా సునాయాసంగా చెప్పేవారు.
  • క్లైమాక్స్ సీన్‌లో సుహాసిని నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారని వెల్లడి.
  • దర్శకుడిగా రాఖీ సినిమా విషయంలో నేను సంతృప్తిగా లేనని కృష్ణవంశీ కామెంట్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా గురించి దర్శకుడు కృష్ణవంశీ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రాఖీ సినిమాపై కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్పగా నటించినప్పటికీ కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. సింహాద్రి తర్వాత యమదొంగ ముందు వరకు తారక్ కి బ్యాడ్ ఫేజ్ నడిచింది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు చేసిన వర్కౌట్ కాలేదు. రాఖీ సినిమా సమయంలో తారక్ అవుట్ ఆఫ్ షేప్ లో కనిపించాడు. అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ తారక్ నటనలో పదును మాత్రం తగ్గలేదు.

డైరెక్టర్ కృష్ణ వంశీ రాఖీ సినిమా విశేషాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాఖీ సినిమా విషయంలో తాను సంతృప్తిగా లేనని కృష్ణవంశీ తెలిపారు. ముఖ్యంగా దర్శకుడిగా నా వర్క్ నాకే నచ్చలేదు. తారక్ మాత్రం అద్భుతంగా నటించాడు. తారక్ డైలాగ్ మెమొరీ అద్భుతం.

సుహాసిని కన్నీళ్ల వెనుక అసలు నిజం ఇదే!

లెన్తీ డైలాగ్స్ ని కూడా తారక్ గుర్తుపెట్టుకుని అలవోకగా చెప్పేవాడు. ఆ సినిమాలో నటీనటులంతా బాగా చేశారు. ముఖ్యంగా సుహాసిని, షాయాజీ షిండే నటన కూడా చాలా బావుంటుంది. ఆ చిత్రంలో షాయాజీ షిండే.. సుహాసిని గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ లో నిజంగానే ఆమెని కాలితో తన్నారు అనే ప్రచారం బయట ఉంది. కానీ అది వాస్తవం కాదు. ఆంత పెద్ద సీనియర్ యాక్టర్ ని పెట్టుకుని అలా ఎందుకు చేస్తాం అని కృష్ణవంశీ అన్నారు.

షాయాజీ షిండే పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న నటుడు. కాలు ఎంత వరకు వెళ్ళాలి. ఎంత టైమింగ్ లో వెనక్కి తీసేయాలి అనేది ఆయనకు తెలుసు. ఆ సీన్ లో నిజంగా తన్నలేదు. అలా చూపించాం అంతే. అది కూడా సుహాసిని గారి అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు కృష్ణవంశీ తెలిపారు.

ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ పై ప్రశంసలు కురిపించిన కృష్ణవంశీ!

క్లైమాక్స్ లో కోర్ట్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు సుహాసిని గారు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. కట్ చెప్పి 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చారు అని కృష్ణ వంశీ గుర్తు చేసుకున్నారు.

కృష్ణవంశీ వెల్లడించిన ఈ విషయాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాఖీ సినిమా గురించి మరిన్ని విశేషాలు ముందు ముందు తెలుసుకుందాం. వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.