|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత బాటలో కృతి శెట్టి.. ఇక కోట్ల వర్షమే?

Published: 04-10-2025, 10:27 AM
సమంత బాటలో కృతి శెట్టి.. ఇక కోట్ల వర్షమే?

టాలీవుడ్ నటి కృతి శెట్టి కెరీర్ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకుండా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో సమంత ఐటెం సాంగ్ ద్వారా కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకున్న తరహాలో, కృతి శెట్టి కూడా అదే బాటలో నడవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఆమెకు కోట్లు కురవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Key Points

1

కృతి శెట్టికి 'ఉప్పెన' తర్వాత పెద్ద హిట్స్ రాలేదు.

2

పూజా హెగ్డే తరహాలో కెరీర్ ముగుస్తుందని ప్రచారం జరుగుతోంది.

4

ఐటెం సాంగ్ సక్సెస్ అయితే కోట్ల వర్షం కురవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

కృతి శెట్టి కెరీర్ ఒడిదుడుకులు

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలియని వారు ఉండరు. ఉప్పెన సినిమాతో మంట పెట్టిన ఈ అందాల తార…. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే.. 2021 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కృతి శెట్టి… ఉప్పెన సినిమా తర్వాత మళ్లీ పెద్ద హిట్ అందుకోలేదు.

సమంత ఫార్ములాతో పునరాగమనం?

ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన ఈ అందాల తార నటించి, మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అదృష్టం బాగా లేక సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ పర్వాలేదనిపించిన మిగిలిన సినిమాలు నిరాశే మిగిల్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కృతి శెట్టి పెద్దగా అవకాశాలు రావడం లేదు. గత సంవత్సరం మనమే సినిమాతో మెరిసిన ఈ బ్యూటీ మళ్ళీ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయలేదని సమాచారం. పూజా హెగ్డే తరహాలో ఈమె కెరీర్ కూడా… ముగుస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఐటెం సాంగ్‌తో కోట్ల వర్షమేనా?

అయితే ఇలాంటి నేపథ్యంలో సమంత తరహాలో… కొత్త బాట ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసి… విడాకుల తర్వాత టాప్ మోస్ట్ హీరోయిన్ గా మళ్లీ మారిపోయారు. ఇక ఇప్పుడు కృతి శెట్టి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటున్నారట. ఒకే ఒక్క ఐటెం సాంగ్ చేసి… మళ్లీ సక్సెస్ బాటలో పడాలని భావిస్తున్నారట. స్టార్ హీరోల సరసన ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోకూడదని అనుకుంటున్నారట. హీరోయిన్ గా అవకాశం రావాలంటే… ఐటెం సాంగ్ చేయాల్సిందే అని ఆమె డిసైడ్ అయ్యారట. ఈ ఫార్ములా సక్సెస్ అయితే.. కచ్చితంగా కృతి శెట్టికి కోట్ల వర్షం కురవడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.

మొత్తంగా, కృతి శెట్టి కెరీర్ పునరుజ్జీవనం కోసం సమంత ఐటెం సాంగ్ వ్యూహాన్ని అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం ఆమెకు మళ్ళీ విజయాలను అందించి, ఆర్థికంగా కూడా లాభదాయకంగా మారుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.