
📌 Key Points
- ‘ఉప్పెన’తో స్టార్ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి ఇటీవల ‘అన్నగారు వస్తారు’ చిత్రంతో వచ్చింది.
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బేబమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మిర్రర్ సెల్ఫీలు షేర్ చేసింది.
- నవంబర్ నెలలో వివిధ డ్రెస్సులలో తీసుకున్న సెల్ఫీలు నెట్టింట వైరల్‌గా మారాయి.
- ‘అద్దమే నిన్ను చూసి అసూయ పడేలా ఉన్నావు బేబమ్మా’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె అందాలను చూసి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
కృతి శెట్టి కెరీర్: ఉప్పెన నుండి లవ్ ఇన్సూరెన్స్ వరకు
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది.
నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.
నెట్టింట బేబమ్మ రచ్చ: వైరల్ అయిన మిర్రర్ సెల్ఫీలు
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వేరే వేరే డ్రెస్సులో మిర్రర్(అద్దం) ముందు తీసుకున్న సెల్ఫీలు ఉన్నాయి. ఇక వాటిని షేర్ చేస్తూ.. ‘నవంబర్ నెలలో తీసుకున్న కొన్ని ఫొటోలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అద్దమే నిన్ను చూసి అసూయ పడేలా ఉన్నావు బేబమ్మా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యాన్స్ కామెంట్స్: అద్దం కూడా అసూయ పడేలా!
A post shared by Krithi Shetty (@krithi.shetty_official)
మొత్తంగా, కృతి శెట్టి అందాల ఆరబోతతో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ మిర్రర్ సెల్ఫీలు ఆమె అభిమానులకు కనుల పండువ చేశాయి. ఇలాంటి పోస్ట్లతో బేబమ్మ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.


