|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుబేర విలన్: ‘కుబేర’ విలన్.. ఇతడు ఎవరో తెలుసా?

Published: 21-06-2025, 5:00 AM
కుబేర విలన్: 'కుబేర' విలన్.. ఇతడు ఎవరో తెలుసా?

‘కుబేర’ సినిమాలోని విలన్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జిమ్ షర్బ్ ఎవరో తెలుసా? ముంబైకి చెందిన ఈ నటుడు తన నటనతో సినిమాకు మరో ఆకర్షణగా నిలిచాడు. అతని బ్యాక్‌గ్రౌండ్, నటనా జీవితం గురించి తెలుసుకుందాం.

Key Points

1

కుబేర సినిమాలో జిమ్ షర్బ్ అద్భుతమైన విలనిజంతో ఆకట్టుకున్నాడు.

2

ఇతను ముంబైకి చెందిన 37 ఏళ్ల నటుడు, అమెరికాలో సైకాలజీ చదివాడు.

4

తెలుగు తెరకు తొలిసారిగా 'కుబేర' సినిమాతో పరిచయమయ్యాడు.

జిమ్ షర్బ్: కుబేర సినిమా విలన్

ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన ‘కుబేర’ విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన ‘నీర్జా’ ఇతడి కెరీర్‌ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.

అతని నటనా జీవితం

బాలీవుడ్‌లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. ‘కుబేర’లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్‌కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

కుబేర సినిమాలో అతని పాత్ర

అలా తెలుగులో ‘కుబేర’ సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్‌కి అవకాశాలు వస్తే టాలీవుడ్‌లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.

చివరగా, తెలుగు తెరకు కొత్త విలన్‌గా పరిచయమైన జిమ్ షర్బ్, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలలో కనిపించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.