
రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలై రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ రెండో రోజు వసూళ్లు ఆశించినంతగా లేవు.
Key Points
రెండు రోజుల్లో రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది కూలీ.
తొలి రోజు వార్ 2 కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించినా, రెండో రోజు తక్కువగా వసూలు అయ్యాయి.
ఇండియాలో రెండు రోజుల్లో రూ. 118.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
ఈ ఏడాది 250 కోట్లు కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగా రికార్డు.
కూలీ సినిమా భారీ ఓపెనింగ్స్
కూలీ 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్: రజనీకాంత్ స్టార్‌డమ్ ఎలాంటిదో చెప్పిన సినిమా కూలీ. 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్‌కు విపరీతమైన ఫాలోయింగ్ అనేదానికి ఈ సినిమానే నిదర్శనం అని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అందుకు కారణం కూలీ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన కూలీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు హిందీ మీడియా పేర్కొంది. దీంతో ఈ ఏడాది 250 కోట్లు కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగా కూలీ మూవీ రికార్డ్ కొట్టింది.
రెండో రోజు కలెక్షన్ల పోలిక
ఇదిలా ఉంటే, స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన రెండో రోజుకు వచ్చేసరికి అవి తగ్గుతాయి. రజనీకాంత్ కూలీ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఆగస్ట్ 14నే విడుదలైన మరో స్టార్ హీరోల సినిమా వార్ 2 కంటే ఎక్కువ కలెక్షన్స్‌ను తొలి రోజు కూలీ సాధించింది. కానీ, రెండో రోజు మాత్రం సీన్ రివర్స్ అయింది.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 కంటే కూలీ మూవీకి ఇండియాలో రెండో రోజు తక్కువ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. కూలీ సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే రెండో రోజు మాత్రం రూ. 53.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇది 17 శాతం తగ్గుదలను సూచిస్తోంది.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక రెండు రోజుల్లో భారతదేశంలో కూలీ సినిమాకు రూ. 118.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అలాగే, ఓవర్సీస్‌లో 2 డేస్‌లో 13 మిలియన్ డాలర్లు (రూ.110 కోట్లు) దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. అన్ని ఏరియాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా కూలీ మూవీకి రూ. 250 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఇక వార్ 2 సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ. 51.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే.. రెండో రోజు రూ. 56.50 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంటే, వార్ 2 సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. అదే కూలీకి తగ్గాయి. అలాగే, రెండో రోజున వార్ 2 కంటే కూలీ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషంగా మారింది.
చివరగా, రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. అయితే, రెండవ రోజు కలెక్షన్ల తగ్గుదల గమనార్హం.


