
📌 Key Points
- కెవిఎన్ ప్రొడక్షన్స్ ‘జన నాయగన్’ మూవీతో వార్తల్లో నిలిచింది.
- యష్‌తో కలిసి ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తోంది కెవిఎన్ ప్రొడక్షన్స్.
- చిరంజీవితో ‘మెగా158’ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ.
- టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులతో కెవిఎన్ సంస్థ ఒప్పందాలు చేసుకుంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సంస్థ ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, దర్శకులతో భారీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తరహాలోనే కెవిఎన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించాలని చూస్తోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ వార్తల్లోకి ఎలా వచ్చింది?
KVN Productions: కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పేరు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న విషయం తెలియంది కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) మూవీ విషయంలో ఈ మీడియా హౌస్ నిత్యం వార్తలలో ఉంటూనే ఉంది. ఆ సినిమా వాయిదా పడటం, సినిమాను నిర్మించిన సంస్థ కోర్టుల చుట్టూ తిరగడం.. ఇలా ఈ సంస్థ పేరు మారుమోగుతోంది. మరోవైపు రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి ఈ సంస్థ నిర్మిస్తోన్న ‘టాక్సిక్’ (Toxic) కూడా, ఈ మీడియా హౌస్ పేరుని వైరల్ అయ్యేలా చేస్తుంది. ఇవి కాకుండా, టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ‘మెగా158’ (Mega158) చిత్రాన్ని కూడా కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థే నిర్మిస్తోంది. ఈ సినిమాతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలతో ఈ సంస్థ సినిమాలను ప్లాన్ చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ కూడా టాలీవుడ్‌కే పరిమితమై సినిమాలు చేసేది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలను కూడా బీట్ చేసి, ఈ రోజు పాన్ ఇండియా తరహాలో సినిమాలు చేస్తూ, ఇతర భాషల్లో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. సేమ్ టు సేమ్ మైత్రీ మూవీ మేకర్స్‌ని ఫాలో అవుతున్నారా? అనేలా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతలు కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారి కళ్లన్నీ టాలీవుడ్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోని డజనుకు పైగా స్టార్స్‌తో వాళ్లు సినిమాలు చేసేందుకు సంప్రదింపులు జరిపారని, వారిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కూడా ఉన్నారని తెలుస్తోంది. అలాగే అరడజనుకు పైగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్‌పై కెవిఎన్ ప్రొడక్షన్స్ దృష్టి?
డజనుకు పైగా స్టార్ హీరోలకు, అరడజనుకు పైగా దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చేసి, ఎప్పుడు కుదిరితే అప్పుడు తమ బ్యానర్‌లో సినిమాలు చేయాలని సదరు నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. నిజంగా ఈ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా హైలెట్ అవుతోంది. ‘సలార్’ వరకు హోంబలే ఫిలింస్ సంస్థ పేరు కూడా ఇలానే వినిపించింది. ఇప్పుడా ప్లేస్‌లోకి కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ వచ్చి చేరింది. మరి ఈ సంస్థ ఒప్పందం చేసుకున్న హీరోలు, దర్శకుల పేర్లు అయితే బయటకు రావడం లేదు కానీ, స్టార్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్‌తోనే సినిమాలు ఉంటాయని మాత్రం టాక్ నడుస్తోంది. ఆల్రెడీ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థకు, మంచి హిట్స్ రెండు పడ్డాయంటే.. ఇక టాలీవుడ్‌లో తిరుగులేనట్టే.. పాగా వేసినట్టే. చూద్దాం మరి.. వారి సంస్థ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవుతాయో? వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కోనం కలిసి ఈ బ్యానర్‌ను స్థాపించారు.
Thank you MEGASTAR @KChiruTweets for the honor of #ChiruBobby2 ❤️
హీరోలు, దర్శకులతో భారీ ఒప్పందాలు నిజమేనా?
With FANBOY @dirbobby steering this storm, we are here to deliver nothing less than a BLOODY BENCHMARK 💥💥 #HBDMegastarChiranjeevi #MEGA158 #ABC pic.twitter.com/rh8a4xjokd
— KVN Productions (@KvnProductions) August 22, 2025
మొత్తానికి కెవిఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో అడుగుపెట్టి అగ్ర నిర్మాణ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.


