|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లాస్ట్ మినిట్‌లో బిగ్ ట్విస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనవాసరావు ‘సింగ్ గీతం’ రిలీజ్‌లో మార్పు

Published: 09-06-2026, 4:46 PM
లాస్ట్ మినిట్‌లో బిగ్ ట్విస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనవాసరావు ‘సింగ్ గీతం’ రిలీజ్‌లో మార్పు

ఒకప్పుడు ఎన్నో క్లాసిక్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. తన 94 ఏళ్ల వయసులో తీసుకొస్తున్న మూవీ ‘సింగ్ గీతం’. ఇదొక మ్యూజికల్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కగా.. ఇందులో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా.. ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా రిలీజ్‌ను వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఒకరోజు ముందుకు జరుపుతూ.. ‘జూన్ 12న ‘కీ రైడ్’ మరింత బిగ్గరగా రాబోతోంది.. సింగ్ గీతం చిత్రానికి ‘క్లీన్ U’ సర్టిఫికేషన్ లభించింది. బిగ్ స్క్రీన్‌పై అందరూ ఆస్వాదించదగ్గ అద్భుతమైన అనుభూతి ఇది. వేచి ఉండండి’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.