
📌 Key Points
- లావా షార్క్ 2 5G మే 2026 నాటికి రూ. 15వేల లోపు ధరతో రానుంది.
- ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
- భారీ బ్యాటరీతో రోజంతా బ్యాకప్, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్.
- 5 లక్షల AnTuTu v11 స్కోర్‌తో శక్తివంతమైన చిప్‌సెట్.
లావా లవర్స్‌కు శుభవార్త! లావా షార్క్ 2 5G త్వరలో భారత మార్కెట్లోకి రాబోతోంది. 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి అద్భుత ఫీచర్లతో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర రూ. 15వేల లోపు ఉండొచ్చని అంచనా.
డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు
Lava Shark 2 5G : లావా లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 2 5జీ భారత మార్కెట్లో వచ్చేస్తోంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ డిస్‌ప్లే ఉంటాయని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
కంపెనీ ప్రకారం.. సరసమైన ధరలో 5G కనెక్టివిటీ, భారీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్ల కోసం ఈ ఫోన్ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌పై రోజంతా బ్యాకప్ అందించగలదని లావా పేర్కొంది.
ప్రస్తుతం, లావా కంపెనీ షార్క్ 2 5జీ ధరను గానీ, ఫుల్ స్పెసిఫికేషన్లను గానీ వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ 2026 మే నెలాఖరు నాటికి లాంచ్ అవుతుందని లావా ధృవీకరించింది. ఈ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.
పనితీరు, ఇతర ఫీచర్లు
Read Also : Aadhaar Update Deadline : మీవి, పిల్లలవి ఆధార్ అప్‌డేట్ చేయలేదా? మీకో బంపర్ ఆఫర్..
లావా షార్క్ 2 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.75-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ డిస్‌ప్లే స్మూత్ స్క్రోలింగ్ మెరుగైన వీడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ ఉంటుందని, 815 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ సుమారు 743 నిమిషాల స్క్రీన్-ఆన్ టైమ్ అందించగలదని లావా పేర్కొంది.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5లక్షల కన్నా ఎక్కువ (AnTuTu v11 స్కోర్) ఉన్న చిప్‌సెట్‌ను అమర్చారు. అయితే, కంపెనీ ఇంకా ఆ ప్రాసెసర్ పేరును వెల్లడించలేదు. అదనంగా, ఈ ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంటుంది.
ధర, లభ్యతపై అంచనాలు
ఫీచర్ ఫోన్‌లు లేదా 4జీ స్మార్ట్‌ఫోన్ల నుంచి 5జీ ఫోన్లకు మారాలనుకునే యూజర్ల కోసం షార్క్ 2 5జీని స్పెషల్ రూపొందించినట్లు లావా చెబుతోంది. ఈ కంపెనీ తమ షార్క్ సిరీస్‌కు రాబోయే మెయిన్ అప్‌గ్రేడ్‌గా రిలీజ్ చేయనుంది.
లావా కంపెనీ మే 2025లో లావా షార్క్ 5జీని రూ. 7,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇందులో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, యూనిసోక్ T765 ప్రాసెసర్ 5000mAh బ్యాటరీ ఉన్నాయి. అక్టోబర్ 2025లో ఈ సంస్థ లావా షార్క్ 2 4జీని లాంచ్ చేసింది. ఇందులో 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.
మొత్తంమీద, లావా షార్క్ 2 5G సరసమైన ధరలో శక్తివంతమైన ఫీచర్లను అందిస్తూ, 5Gకి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి గొప్ప ఎంపికగా నిలుస్తుంది. మే 2026లో దీని లాంచ్ కోసం ఎదురుచూద్దాం.


