|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుణ్ అంటే లావణ్యకు తొలిచూపులోనే ప్రేమ! మనసులోని మాట బయటపెట్టిన అందాల రాక్షసి!

Published: 12-03-2026, 5:35 AM
వరుణ్ అంటే లావణ్యకు తొలిచూపులోనే ప్రేమ! మనసులోని మాట బయటపెట్టిన అందాల రాక్షసి!
  • లావణ్య, వరుణ్ ‘మిస్టర్’ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు, అప్పుడే ప్రేమ మొదలైంది.
  • పెళ్లి తర్వాత లావణ్య ‘సతి లీలావతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
  • వరుణ్ తన పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారని, బిడ్డలా చూసుకుంటారని లావణ్య అన్నారు.
  • వరుణ్ కళ్ళు నచ్చడంతో ఆ విషయాన్ని ఆయనకు చెప్పానని లావణ్య తెలిపారు.

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమ కథ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మొదటిసారి వరుణ్ ను చూసినప్పుడు ఎలా అనిపించిందో లావణ్య స్వయంగా చెప్పారు. వారి ప్రేమకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లావణ్య, వరుణ్ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే…

Lavanya Tripathi: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఒకరు. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తెలుగు ఇంటి కోడలుగా స్థిరపడ్డారు. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్(Varun Tej) ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సతి లీలావతి (Sathi Leelavathi)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లావణ్య వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు వరుణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మిస్టర్ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోను చూపించడంతో ఆ ఫోటో చాలా మెమోరబుల్ అని తెలిపారు. తాను వరుణ్ అప్పటివరకు ఒకసారి మాత్రమే కలిశాను కానీ ఎక్కడ మాట్లాడలేదని తెలిపారు. మొదటిసారి ఈ సినిమా పూజా కార్యక్రమాలలో తనని చూసినప్పుడు చూడడానికి మంచి నటుడిలా ఉన్నాడనే భావన నాలో కలిగిందని తెలిపారు. నిజానికి తనని నేను భలే భలే మగాడివోయ్ సినిమా కంటే ముందుగా ఒకసారి కలిశానని తెలిపారు.

‘మిస్టర్’ సినిమాతో ప్రేమ చిగురించింది

ఒక సినిమా వేడుకలో భాగంగా హాజరయ్యామని అప్పుడు వరుణ్ నా పక్కనే కూర్చున్నారు కానీ అతనితో నేను మాట్లాడలేదు. కానీ ఆయన ఒకసారి అలా నా వైపు చూడగానే తన కళ్ళు నాకు బాగా నచ్చేసాయని తెలిపారు. అలా తన కళ్ళు నచ్చడంతో ఆ విషయాన్ని ఆయనకు చెప్పానని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమ గురించి తెలిపారు. వరుణ్ తన విషయంలో చాల కేర్ తీసుకుంటారని, తనని ఒక బిడ్డలా చూసుకుంటారు అంటూ వరుణ్ తేజ్ గురించి ఈమె తెలిపారు. ఇక తన అత్తయ్య మామయ్య కూడా చాలా మంచిగా చూసుకుంటారని తన అత్తయ్య అప్పుడప్పుడు నాకోసం కొన్ని గిఫ్ట్స్ కూడా కొంటారని తెలిపారు.

మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమ…

వరుణ్ తనని బిడ్డలా చూసుకుంటాడు: లావణ్య

ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మొదటిసారి మిస్టర్ అనే సినిమాలో నటించారు. అనంతరం వీరిద్దరూ అంతరిక్షం అనే సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా రెండు సినిమాలలో కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా వీరి ప్రేమ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డారు. వీరి లవ్ రూమర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ వీరిద్దరూ ఆ రూమర్లను ఖండించారు. కానీ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ జంట 2023 నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లవ్ స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉంది. వారిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.