|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lavanya Tripathi: భర్తతో కలిసి వెకేషన్.. బేబీ బంప్ పిక్స్ వైరల్

Published: 13-06-2025, 7:36 AM
Lavanya Tripathi: భర్తతో కలిసి వెకేషన్.. బేబీ బంప్ పిక్స్ వైరల్

మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గర్భవతి. తాజాగా వీరిద్దరూ మాల్దీవుల్లో హాలిడే ట్రిప్ వెళ్లారు. బేబీ బంప్ తో ఉన్న లావణ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

లావణ్య త్రిపాఠి గర్భవతి అని వరుణ్ తేజ్ గత నెల ప్రకటించాడు.

2

జంట మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

4

ప్రస్తుతం లావణ్య కొత్త సినిమాలు చేయడం అనుమానమే.

మాల్దీవుల్లో హాలిడే

మెగా కోడలు త్వరలో తల్లి కాబోతుంది. గత నెలలోనే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి అటు వరుణ్ గానీ ఇటు లావణ్య గానీ మీడియా కంట పడట్లేదు. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్‌కు వెకేషన్ వెళ్లారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లావణ్య బేబీ బంప్‌తో కనిపించింది.

బేబీ బంప్ ఫోటోలు వైరల్

కలిసి రెండు సినిమాలు చేసిన వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు సినిమాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. అలా ఈ ఏడాది మే 6న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.

ఇప్పుడు బేబీ బంప్‌తో బీచ్ ఒడ్డున భర్తతో కలిసి కనిపించింది. ప్రస్తుతం వరుణ్-లావణ్య.. మాల్దీవుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మెగా కోడలు ఇప్పట్లో కొత్త సినిమాలు చేయడం కష్టమే. ఒకవేళ బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే కనిపించొచ్చు. లేదంటే మొత్తానికే కెరీర్‌ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

లావణ్య త్రిపాఠి సినిమా కెరీర్

వరుణ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లావణ్య త్రిపాఠి తల్లి కావడానికి సిద్ధమవుతుండటంతో, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.