|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రెగ్నెన్సీతో లావణ్య త్రిపాఠి సాహసం! సతీ లీలావతి షూటింగ్ కష్టాలు!

Published: 21-02-2026, 5:05 AM
షాకింగ్: ప్రెగ్నెన్సీతో లావణ్య త్రిపాఠి సాహసం! సతీ లీలావతి షూటింగ్ కష్టాలు!
  • లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ సినిమా షూటింగ్ సమయంలో గర్భవతి అని వెల్లడించారు.
  • ప్రెగ్నెన్సీ కారణంగా వాంతులు, మైగ్రేన్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
  • డాక్టర్ల సలహాతో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేశానని లావణ్య అన్నారు.
  • మూడు నెలలు వచ్చేసరికి షూటింగ్ పూర్తి చేశామని, బేబీ బంప్ కనిపించే అవకాశం ఉండటంతో త్వరగా పూర్తి చేశామన్నారు.

లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతి అని తెలిపారు. ఈ సమయంలో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, సినిమాను పూర్తి చేయడానికి ఆమె తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.

ప్రెగ్నెన్సీతో సతీ లీలావతి షూటింగ్ ప్రారంభం

Lavanya Tripathi: లావణ్య త్రిపాటి అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తెలుగు సినిమాలలో నటిస్తున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు .పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరమవుతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని స్పష్టమైనది.

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి సతీ లీలావతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మార్చి 6వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమ కనకాలతో కలిసి చిత్ర బృందం ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వారానికి ముందే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే విషయాన్ని లావణ్య త్రిపాఠి తెలిపారు.

లావణ్య త్రిపాఠి ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు

ఇలా తన ప్రేగ్నెన్సీ గురించి డైరెక్టర్ లేదా నిర్మాత వద్ద చెబితే చాలా ఇబ్బందులు పడతారు. అన్ని సెట్ చేసుకున్న తర్వాత నేను ఈ సినిమా నుంచి తప్పుకోవటం సరైంది కాదు అని భావించి నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచిపెట్టి సినిమా షూటింగ్లో పాల్గొన్నానని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు విపరీతమైన వాంతులు, మైగ్రేన్ హెడేక్ వంటివి ఇబ్బందులు కలిగాయని లావణ్య త్రిపాఠి తెలిపారు. ప్రెగ్నెన్సీ వన్ మంత్ పూర్తయిన తర్వాత చిత్ర బృందానికి ఈ విషయం తెలియజేశానని లావణ్య త్రిపాఠి తెలిపారు డాక్టర్ల సలహాతోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని , ఈ సినిమా షూటింగ్ సమయంలో రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.

నాకు మూడో నెల వచ్చేసరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసామని తెలిపారు. మూడు నెలల తర్వాత అంటే బేబీ బంప్ కనిపిస్తుంది అందుకే షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తి చేశామని లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రెగ్నెన్సీ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఈ సందర్భంగా తెలియచేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించగా లావణ్య త్రిపాఠి దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నాగమోహన్ నిర్మాతగా వ్యవహరించారు.

జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి

లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్లో పాల్గొనడం, అనేక జాగ్రత్తలు తీసుకోవడం నిజంగా సాహసోపేతమైన విషయమని చెప్పవచ్చు. ఆమె వృత్తి పట్ల అంకితభావానికి ఇది నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.