|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Laya: అసలే తెలుగమ్మాయిని.. ఇంతకీ సినిమాలో ఉన్నానా?: డైరెక్టర్‌తో లయ

Published: 04-05-2025, 9:13 AM
Laya: అసలే తెలుగమ్మాయిని.. ఇంతకీ సినిమాలో ఉన్నానా?: డైరెక్టర్‌తో లయ

నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన వీడియోలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హాస్యపూరితంగా పాల్గొన్నారు.

Key Points

1

నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదల.

2

లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ 'తమ్ముడు' టీమ్‌లో నటించారు.

4

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మించబడింది.

తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

రాబిన్‌హుడ్ తర్వాత నితిన్ ‍హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్‌ వేణు శ్రీరామ్ బర్త్‌ డే సందర్భంగా షేర్ చేసిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.

లయ తో డైరెక్టర్‌తో వినోద ప్రమోషన్

డైరెక్టర్‌ వేణు శ్రీరామ్ పుట్టినరోజు కానుకగా తమ్ముడు మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ‍అయితే ఈ విషయాన్ని ఓ వీడియో  రూపంలో వెల్లడించారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ దగ్గరికి వచ్చిన హీరోయిన్లు బర్త్‌ డే విషెస్‌కు బదులుగా మూవీ రిలీజ్‌ డేట్ ఎప్పుడు సార్?అని అడుగుతారు. దీంతో ఆయన కాస్తా షాకింగ్‌కు గురవుతారు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరో సీనియర్‌ టాలీవుడ్ హీరోయిన్ లయ కూడా దర్శకుడితో మూవీ విడుదల తేదీ గురించే ఆరా అడుగుతుంది. తెలుగమ్మాయిని.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నా.. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? డైరెక్టర్‌ను ప్రశ్నిస్తుంది. ఒక్క పోస్టర్‌ లేదు.. అప్‌డేట్‌ లేదు.. కనీసం సినిమా రిలీజ్‌ డేట్‌ అయినా చెప్పండి.. వెళ్లి థియేటర్లోనే చూసుకుంటా అని లయ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ మూవీ ప్రమోషన్లలో ఇదొక డిఫరెంట్‌ వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

‘తమ్ముడు’ చిత్ర బృందం

కాగా.. వేణు శ్రీరామ్- నితిన్ కాంబోలో వస్తోన్న తమ్ముడు మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్‌రాజు, అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాబిన్‌ హుడ్‌ మూవీ హిట్ కాకపోవడంతో నితిన్ ఫ్యాన్స్‌ తమ్ముడిపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు. మరీ వారి అంచనాలకు తగినట్లుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే జూలై 4వరకు వేచి చూడాల్సిందే.

చివరగా, ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానున్న విషయం వెల్లడైంది. లయ సహా ఇతర నటీనటుల ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.