|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లయ కెరీర్‌కు బ్రేక్ వేసిన ఆ ఒక్క సినిమా! షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరోయిన్ లయ!!

Published: 11-03-2026, 12:35 PM
లయ కెరీర్‌కు బ్రేక్ వేసిన ఆ ఒక్క సినిమా! షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరోయిన్ లయ!!
  • హీరోయిన్ లయ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ, నితిన్‌కి అక్కగా ‘తమ్ముడు’ మూవీలో నటించారు.
  • ‘ప్రేమించు’ మూవీలో బ్లైండ్‌ లేడీగా లయ నటన, కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ కు బ్రేక్ పడింది.
  • ఆ తర్వాత ట్రెడిషనల్‌ పాత్రలే రావడంతో కమర్షియల్‌ సినిమాలకు దూరం ఐయ్యారు లయ.
  • బిగ్‌ టీవీ `కిస్సిక్‌ టాక్స్`లో లయ తన కెరీర్‌కి సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడించారు.

టాలీవుడ్ హీరోయిన్ లయ గురించి ఒక సంచలన వార్త! లయ చేసిన ఒక మిస్టేక్ ఆమె కెరీర్‌ను ఎలా మార్చిందో తెలుసా? ఆసక్తికరమైన విషయాలు మీకోసం!

లయ కెరీర్ బిగినింగ్ విశేషాలు

హీరోయిన్‌ లయ మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య `తమ్ముడు` మూవీలో నితిన్‌కి అక్కగా నటించింది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని` అనే చిత్రంలో నటించింది. ఇందులో శివాజీ హీరో. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రమిది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కానీ నటిగా లయ మాత్రం అదరగొట్టింది. తనదైన నటనతో రచ్చ చేసింది.  అయితే తాజాగా ఆమె తన కెరీర్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను తప్పు చేసినట్టు రియలైజ్‌ అయ్యింది. తెలియకుండా చేసినట్టు తెలిపింది.

లయ కెరీర్‌ ప్రారంభంలో ఆమె గ్లామర్‌ రోల్స్ చేసింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ అంతలోనే అనూహ్యంగా ఒక డీగ్లామర్‌ పాత్ర చేసింది. `ప్రేమించు` అనే చిత్రంలో బ్లైండ్‌ లేడీగా కనిపించింది. అంధురాలిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతుంది. మంచి కమర్షియల్‌ మూవీస్‌ వస్తున్నాయి. పెద్ద హీరోయిన్‌గా మారబోతుంది, బిజీ కాబోతున్న సమయంలో లయ సంచలన నిర్ణయం తీసుకుంది. అంధురాలి పాత్ర చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆ మూవీ మంచి ఆదరణే పొందింది. కానీ లయ కెరీర్‌ మొత్తం మారిపోయింది.

డీగ్లామర్ రోల్ ఎఫెక్ట్ ఏంటి?

ఇందులో డీ గ్లామర్‌ రోల్‌ చేయడంతో నెక్ట్స్ సినిమాలన్నీ ట్రెడిషనల్‌గా ఉండే పాత్రలే వచ్చాయి. కమర్షియల్‌ సినిమాలన్నీ తగ్గిపోయాయి. లయ ఇలాంటి సినిమాలకే సెట్‌ అవుతుందని, మేకర్స్ ఫ్యామిలీ చిత్రాలే ఆఫర్‌ చేశారు, తాను కూడా అలాంటి సినిమాలే చేసింది. దీంతో కమర్షియల్‌ మూవీస్‌కి దూరమయ్యింది లయ. కొంత కాలం బాగానే సర్వైవ్‌ అయ్యింది. `టాటా బీర్లా మధ్యలో లైలా` వరకు ట్రెడిషనల్‌ రోల్స్ తో సర్వైవ్‌ అయ్యింది. కానీ పెద్దగా హిట్స్ లేవు. ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకుని ఏకంగా సినిమాలకే దూరమయ్యింది లయ.

తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ, ఆ టైమ్‌లో తనకు ఏం తెలియలేదని, పాత్ర నచ్చి చేశానని తెలిపింది. ఆ సమయంలో చెప్పేవారు లేరు, తనది కూడా ఏజ్‌ చిన్నదే అని, ఒక కమర్షియల్‌ హీరోయిన్‌గా వెళ్లాలనుకుంటే మీరు ఆర్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తారేంటి? అని అన్నారు. ఏంటి ఇలా అంటున్నారు, దీని వల్ల నెక్ట్స్ సినిమాకి ఎఫెక్ట్ ఉంటుందా? అనే విషయం తనకు కూడా అర్థం కాలేదని తెలిపింది.   తాను మిస్టేక్‌ చేసిన విషయాన్ని లయ వెల్లడించింది. బిగ్‌ టీవీ `కిస్సిక్‌ టాక్స్`లో ఈ విషయాన్ని తెలిపింది.

రీఎంట్రీలో లయ సంచలన నిర్ణయాలు

సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ, తనకు నచ్చి, ఆ పాత్రని వదులుకోలేక నటించానని, ఆ తర్వాత ఆఫర్లు బాగానే వచ్చాయని, కానీ గ్లామర్‌ రోల్స్ రాలేదని, ట్రెడిషనల్‌గా ఉండే పాత్రలే వచ్చాయని తెలిపింది. ఆ విషయంలో తనకు బాధ లేదని తెలిపింది. ఇక ఇప్పుడు తన భర్త సపోర్ట్ తోనే సినిమాలు చేస్తున్నానని, ఆయన వద్దు అంటే సినిమాలు చేయనని వెల్లడించింది లయ.

లయ కెరీర్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో మీ ముందుకు వస్తాయి. అప్పటివరకు మా పేజీని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.