|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్‌తో లోకేష్ ప్రేమాయణం నిజమా? డైరెక్టర్ సమాధానం వింటే షాక్!

Published: 27-01-2026, 12:35 PM
హీరోయిన్‌తో లోకేష్ ప్రేమాయణం నిజమా? డైరెక్టర్ సమాధానం వింటే షాక్!
  • డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒక హీరోయిన్ ప్రేమలో ఉన్నారనే వార్తలపై స్పందించారు.
  • కుటుంబం ఉంది అంటూ ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి క్లారిటీ ఇచ్చారు.
  • రిపోర్టర్లు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడుగుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
  • లోకేష్ ప్రస్తుతం హీరోగా ‘DC’ సినిమాలో నటిస్తూ, అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నారు.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒక హీరోయిన్తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

హీరోయిన్ ప్రేమ వార్తలపై లోకేష్ క్లారిటీ!

Lokesh Kanagaraj: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అపజయ మెరుగని దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)ఒకరు. ఇప్పటివరకు ఈయనఆరు సినిమాలకు దర్శకుడుగా పనిచేశారు. ఈ ఆరు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయన తమిళ హీరోలతో మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరోలను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం లోకేష్ ఒక వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈయన DC అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు లోకేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చింది ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా లోకేష్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.. ఇటీవల ఈయన ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టర్ నుంచి లోకేష్ కు వింత ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నల కారణంగా సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు.

రిపోర్టర్ల ప్రశ్నలపై నెటిజన్ల ఆగ్రహం

ఈ నేపథ్యంలోనే రిపోర్టర్ లోకేష్ కనగరాజ్ ను ప్రశ్నిస్తూ.. గత కొంతకాలంగా మీరు ఒక హీరోయిన్  ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ లేదు సార్ నాకు ఫ్యామిలీ ఉంది అంటూ చాలా హుందాగా సమాధానం చెప్పారు.. లోకేష్ ఇలాంటి సమాధానం చెప్పినప్పటికీ రిపోర్టర్ వదిలిపెట్టకుండా రెండో ఫ్యామిలీ ఆలోచన లేదా అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే లోకేష్ నేను సమాధానం చెప్పను అంటూ తన ప్రెస్ మీట్ అక్కడితో ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు రిపోర్టర్ల తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్యామిలీతో సంతోషంగా లోకేష్..

లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్స్

ఇక లోకేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2012 వ సంవత్సరంలో ఐశ్వర్య అనే అమ్మాయిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఈయన కూడా తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.

మొత్తానికి లోకేష్ కనగరాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది. ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.