
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి నటించిన ‘ఓ చెలియా’ చిత్రం టీజర్ శ్రీకాంత్ చే విడుదలైంది. హారర్, ప్రేమ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
Key Points
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు
హారర్, లవ్, యాక్షన్ నేపథ్యంతో ఉత్కంఠభరిత కథ
శ్రీకాంత్ టీజర్ విడుదల చేశారు
మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదలైన పాట వైరల్
‘ఓ చెలియా’ టీజర్ విడుదల
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్‌పై రూపాశ్రీ కొపురు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, ‘‘ఓ చెలియా’ మూవీ టీజర్ నాకు చాలా నచ్చింది. యంగ్ టీమ్ కలిసి ఈ సినిమాని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది.
నటీనటులకు, దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు. ‘‘హారర్, లవ్, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఇందులో ప్రేక్షకులను భయపెట్టించే అంశాలు చాలానే ఉంటాయి. ఈ ప్రేమ కథలోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా ఈ మూవీ సాగు తుంది. మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదల చేసిన తొలి పాట వైరల్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా, సంగీతం: ఎంఎం కుమార్.
హారర్, లవ్, యాక్షన్ కథాంశం
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
‘ఓ చెలియా’ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. హారర్, ప్రేమ, యాక్షన్ మిశ్రమంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశాలున్నాయి.


