|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ సిలిండర్లపై నిఘా కొరడా! బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు సీఎస్ ఆదేశాలు!!

Published: 13-03-2026, 4:35 AM
గ్యాస్ సిలిండర్లపై నిఘా కొరడా! బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు సీఎస్ ఆదేశాలు!!
  • రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి.
  • గ్యాస్ సిలిండర్ల పంపిణీలో బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.
  • ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు డిమాండ్ మేరకు గ్యాస్ సరఫరా జరుగుతోంది.
  • వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందేలా చూడాలని ఆయిల్ కంపెనీలకు సూచన.

రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు.

ఎల్పీజీ నిల్వలపై ప్రభుత్వ సమీక్ష

రాష్ట్రంలో LPG నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి… పలు సూచనలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ……. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఎజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయని….. ప్రస్తుత డిమాండ్ కు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

గ్యాస్ పంపిణీలో తీసుకోవాల్సిన చర్యలు

ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు కు డిమాండ్ మేరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, శాఖ అధికారులు పేర్కొన్నారు.

సకాలంలో సిలిండర్ల సరఫరాకు ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో HPCL, IOCL, BPCL మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు, గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయడమే లక్ష్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.