
📌 Key Points
- మాదాపూర్‌లో డీసీఎం స్కూటీని ఢీకొట్టి కిలోమీటరు మేర లాక్కెళ్లడంతో మహిళ మృతి.
- మృతురాలు కేరళకు చెందిన ఆయేషాగా గుర్తించారు, ఆమె భర్త బాసిత్ తీవ్రంగా గాయపడ్డారు.
- ప్రమాదం తర్వాత డీసీఎం డ్రైవర్ పారిపోయాడు, క్లీనర్ పోలీసులకు చిక్కాడు.
- నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ డీసీఎం స్కూటీని ఢీకొట్టి కిలోమీటరు మేర లాక్కెళ్లడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మాదాపూర్‌లో విషాద ఘటన: డీసీఎం బీభత్సం
కొంతమంది వాహనాదారులు… వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తప్పతాగి వాహనాలను నడపటం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తూ… ఇతరుల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నారు. పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నప్పటికీ…. ఏదో ఒక చోట విషాద ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం…ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
ప్రాథమిక వివరాల ప్రకారం…. మాదాపూర్ మీదుగా అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనైే మైండ్ స్పేస్ వద్ద వీరి స్కూటీని… డీసీఎం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. స్కూటీ డీసీఎం కిందికి వెళ్లిపోయింది. ప్రమాద తీరును గమనించిన డీసీఎం డ్రైవర్… కనీసం కిందికి కూడా దిగలేదు. డీసీఎంను ఆపకుండా కిలో మీటర్ మేర అలానే లాక్కుని వెళ్లి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల తర్వాత జరిగింది.
స్కూటీ ఇరుకుపోయిన విషయాన్ని రోడ్డుపై ఉన్న వాళ్లు గమనించి… డ్రైవర్ ను ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే డ్రైవర్ డీసీఎం దిగి పారిపోగా… క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య ఆయేషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త బాసిత్ కు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర విభాగంలో ఉంచి… చికిత్స అందిస్తున్నారు.
కిలోమీటరు మేర లాక్కెళ్లిన డీసీఎం, మహిళ మృతి
వీరు కేరళకు చెందిన దంపతులుగా గుర్తించారు. కూకట్‌పల్లిలోని ఓ మాల్‌లో సినిమా చూసి… మహేశ్వరంలోని తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాద తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లను కఠినంగా శిక్షిస్తేనే…. ఇతరుల్లో కూడా మార్పు వస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై నెటిజన్ల ఆగ్రహం
పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని… పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేయగా… తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ ఘటన నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిదర్శనం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


