
📌 Key Points
- సాయిబాబా దేవుడు కాదని, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని మాధవీ లత వ్యాఖ్యానించారు.
- వ్యాఖ్యలపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
- తెలుగు మహాపురుషులను కాకుండా సాయిబాబాను పూజించడంపై ఆమె ప్రశ్నించారు.
- “సాయి” తోకలు కత్తిరించాలని, హిందువులు మారాలని ఆమె సూచించారు.
సినీనటి, బిజెపి నాయకురాలు మాధవీ లత సాయిబాబా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాయిబాబా దేవుడు కాదని, ఆయన ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని ఆమె అనడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై పోలీస్ కేసు కూడా నమోదైంది.
మాధవీ లత సంచలన వ్యాఖ్యలు
Madhavi Latha: సినీనటి మాధవి లత పరిచయం అవసరం లేని పేరు. ఈమె సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవడం కంటే కూడా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన మాధవి లత ఇటీవల సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ బిజెపి పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తూ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నిత్యం సోషల్ మీడియా వేదికగా పలు అంశాల గురించి మాట్లాడుతూ చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంటాయి. అయితే ఇటీవల మాధవి లత(Madhavi Latha) సాయిబాబా(Sai Baba) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సాయిబాబా దేవుడే కాదని ఈమె చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే.
సాయిబాబాను పూజించే హిందువులు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాధవి లత చేసిన ఈ వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ పెద్ద ఎత్తున డిబేట్ లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత సాయిబాబా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సాయిబాబా దేవుడే కాదని, ఆయన ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అంటూ మాట్లాడారు. ఇలా ఒక ముస్లిం వ్యక్తిని హిందువులు ఎందుకు పూజిస్తున్నారో అర్థం కావడం లేదని మాధవి లత తెలిపారు.
సాయిబాబాపై ఆమె వాదన
మన తెలుగువారిలో కూడా వీరబ్రహ్మేంద్రస్వామి రాఘవేంద్ర స్వామి వంటి వారు కూడా జీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాలజ్ఞానం అక్షర సత్యమని తెలియజేశారు. హిందువులు ఇలాంటి వారిని ఎందుకు పూజించడం లేదు? ఎందుకంటే వీరికి సరైన మార్కెటింగ్ లేకపోవటం వల్లే మన తెలుగువారిని పూజించడం లేదని మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిబాబా భక్తుల మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు.. మా హిందువులకు సిగ్గులేదంటూ మాధవి లత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ విషయంలో హిందువులందరూ తప్పకుండా మారాలని సూచించారు. ఇక హిందువులు ఇటీవల కాలంలో సాయిరాం, సాయి కృష్ణ అంటూ సాయిబాబా పేరును పక్కన తోకలుగా తగిలించుకున్నారు. ముందు ఆ తోకలను కత్తిరించాలని తెలిపారు.
మన హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామాయణం చదివితే మహిళలకు, పురుషులకు ఏదో తెలియని ధైర్యం ,పరాక్రమం వస్తుంది అదే సాయిబాబా కథ చదివితే ఏమొస్తుందని ప్రశ్నించారు? సాయిబాబాను పూజించడం అంటే దయ్యానికి పూజ చేసినట్లే అంటూ మాధవి లత తెలియజేశారు. సాయిబాబు గుడికి వెళ్తే అతను దేవుడనే భావన నాలో ఏమాత్రం కలగదని తెలిపారు. ఇక ఈ డిబేట్ లో భాగంగా మరికొంతమంది కూడా పాల్గొన్నారు. అయితే వీరందరూ మాధవి లత వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తూ ఆమెకు మద్దతు తెలియజేశారు. ఇక మాధవి లత సాయిబాబా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సాయిబాబా భక్తుల మాత్రం ఈమె పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.
భక్తుల ఆగ్రహం, పోలీస్ కేసు
మాధవీ లత వ్యాఖ్యలు సమాజంలో పెద్ద చర్చకు దారితీశాయి. సాయిబాబా భక్తులు, హిందుత్వ వాదుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.


