
📌 Key Points
- భక్త కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు శివుడి భక్తుడిగా అద్భుతంగా నటించారు.
- శ్రీ మంజునాథంలో చిరంజీవి శివుడి పాత్రలో నటించారు.
- మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివ భక్తుడిగా నటించారు.
- కాళహస్తి మహత్యం శివుడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
మహాశివరాత్రి సందర్భంగా శివుడి మహత్యాన్ని తెలిపే సినిమాలు చూడాలని ఉందా? భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ, కన్నప్ప వంటి సినిమాలు శివుడి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ సినిమాలు శివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
భక్త కన్నప్ప: శివ భక్తికి నిదర్శనం
Maha Shivaratri: తెలుగువారు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శివయ్య మహత్యాన్ని తెలుపుతూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి రోజు జాగరణ చేసేవారు శివుడి మహత్యం తెలుసుకోవాలి అంటే తప్పకుండా చూడాల్సిన కొన్ని సినిమాలను ఇక్కడ తెలుసుకుందాం తెలుగులో ఎన్నో శివ మహత్యాన్ని తెలుపుతూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం..
ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో శివుడి మహత్యాన్ని తెలుపుతూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ భక్తకన్నప్ప సినిమా మాత్రం ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమే అని చెప్పాలి. శివుడు భక్తుడి పాత్రలో నటుడు కృష్ణంరాజు ఎంతో అద్భుతంగా నటించిన తీరు అద్భుతమని చెప్పాలి ఈయన భక్తకన్నప్ప అనే పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాలలో మొదటి సినిమా భక్తకన్నప్ప అనే చెప్పాలి.
శివరాత్రి అనగానే టక్కున శ్రీ మంజునాథం సినిమా కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. చిరంజీవి శివుడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు . దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వ్యక్తి శివయ్యకు భక్తుడిగా ఎలా మారాడు అనే నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో చిరంజీవి శివుడి పాత్రలో నటించగా అర్జున్ భక్తుడిగా కనిపించారు. సౌందర్య , మీనా హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
శ్రీ మంజునాథ: దేవుని లీలలు
తాజాగా మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా కూడా శివ మహత్యాన్ని తెలుపుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించగా, శివుడి భక్తుడిగా విష్ణు నటన అద్భుతంగా నిలిచింది శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాలలో కన్నప్ప సినిమా కూడా ఒకటి.
శివరాత్రి అంటే చూడవలసిన సినిమాలలో కాళహస్తి మహత్వం సినిమా కూడా ఒకటి. శివుడి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శివరాత్రి జాగరణ చేసేవారికి ఈ సినిమా కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించారు.
కన్నప్ప: శివయ్య గొప్పతనం
రేణుక శర్మ దర్శకత్వంలో మీనా ప్రధానపాత్రలో నటించిన చిత్రం మహాశివరాత్రి. సాయికుమార్ రాజేంద్రప్రసాద్ వంటి తదితరులు నటించిన ఈ సినిమా శివరాత్రి పండుగకు చూడదగ్గ సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు కార్తికేయ, సుబ్రమణ్యపురం, భూ కైలాస్, జగద్గురు ఆదిశంకర వంటి తదితర సినిమాలను కూడా శివరాత్రి పండుగ సందర్భంగా చూడదగ్గ సినిమాలని చెప్పాలి.
మహాశివరాత్రి పర్వదినాన ఈ సినిమాలు చూడటం ద్వారా శివుడి గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. భక్తి భావంతో ఈ పండుగను జరుపుకోండి. శివయ్య అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.


