
📌 Key Points
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ.. భారీ యాక్షన్ అడ్వెంచర్!
- నిజం సినిమాలో ఎమోషనల్ సీన్‌లో మహేష్ బాబు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారన్న రామేశ్వరి!
- రూ.1200-1300 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న వారణాసి.. ప్రియాంక చోప్రా హీరోయిన్!
- పుష్ప రేంజ్ లో అల్లు అర్జున్ కి, బాహుబలి రేంజ్ లో ప్రభాస్ కి ఏ విధంగా పేరు వచ్చిందో అదే విధంగా మహేష్ కి వారణాసి మూవీతో వస్తుంది!
మహేష్ బాబు గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ‘నిజం’ సినిమాలో ఒక సన్నివేశంలో ఆయన నిజంగానే ఏడ్చేశారట! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజం సినిమాలో మహేష్ బాబు ఎమోషనల్ సీన్ వెనుక అసలు నిజం!
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి దాదాపు 1200 నుంచి 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారని ఒక అంచనా. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో కనిపిస్తారట. రాజమౌళి మహేష్ బాబు కలిసి చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. భారతీయ పురాణాల నుండి ప్రేరణతో ఈ సినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. వారణాసి సినిమా వల్ల మహేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం వారణాసి చిత్రం ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒక భారీ యాక్షన్ సన్నివేశం కోసం జార్జియా వెళ్లారు. ఆ తర్వాత అంటార్కిటి కాలో కూడా షూటింగ్ నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముగిసిపోయే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఉగాది సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి ‘వారణాసి’ మూవీ అప్డేట్స్.. భారీ బడ్జెట్, ప్రియాంక చోప్రా!
మహేష్ బాబుకు సంబంధించి ఒక సీనియర్ నటి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. నిజం సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది రామేశ్వరి. ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చింది. నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా రేఖ, జయ బచ్చన్ వంటి ఎంతోమంది హీరోయిన్లను అడిగారని, కానీ వారందరూ ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. తర్వాత ఆ పాత్ర కోసం తేజ తనను సంప్రదించారని, అప్పటికీ తన కొడుకు ఎగ్జామ్స్ ఉండడంతో చేయలేనని చెప్పానని అన్నారు. అయితే తేజ షూటింగ్ ను త్వరగా పూర్తి చేస్తామని మాట ఇవ్వడంతో ఒప్పుకున్నానని చెప్పారు. తాను డైలాగులు నేర్చుకుంటున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మహేష్ బాబు, తేజ ఎన్నో జోకులు వేసేవారని వివరించారు. అయితే నిజం సినిమాలో ఒకచోట తల్లిని ఆటో ఎక్కించి మహేష్ బాబు కంటనీరు పెట్టుకునే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో మహేష్ బాబు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారని వివరించారు రామేశ్వరి. ఒక కొడుకుగా మహేష్ బాబు పూర్తిగా ఆ సన్నివేశంలో లీనమైపోయారని.. అందుకే ఆ ఎమోషనల్ సీనులో నిజంగానే కన్నీరు పెట్టుకున్నారని వివరించండి రామేశ్వరి.
మహేష్ బాబు వారణాసి మూవీతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి!
మహేష్ బాబు వారణాసి సినిమా విడుదలయ్యాక భారీ హిట్టు కొడితే అల్లు అర్జున్ కు పుష్ప, ప్రభాస్‌కు బాహుబలి స్థాయిలో, మహేష్ బాబు కూడా వారణాసి మూవీ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత సినిమాగా మిగిలిపోతుంది. వారణాసిలో కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు ప్రియాంక చోప్రా కూడా ఎన్నో ఈ యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఈ సినిమాలో నటించేందుకు ప్రియాంకను ఒప్పించేందుకు భారీగా రెమ్యూనరేషన్ అందించారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రియాంక చోప్రా కూడా నటనతో ఇరగదీసిందని సమాచారం. చీరలో కూడా ఆమె ఎన్నో యాక్షన్ సన్నివేశాలను అలాగే చేసేసిందట.
మహేష్ బాబు వారణాసి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


