
సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సినిమా రీరిలీజ్‌కు సంబంధించి నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
ఖలేజా సినిమా రీరిలీజ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో ఉత్సాహం
నిర్మాత సి. కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్: మహేష్ బాబు అభిమానులు సినిమాను సర్వనాశనం చేశారని ఆరోపణ
మిడ్‌నైట్ షో తర్వాత నిర్మాతకు వచ్చిన బూతు కాల్స్, బెదిరింపులు
15 సంవత్సరాల తర్వాత ఖలేజా సినిమాకు మళ్ళీ విజయం సాధించే అవకాశం
ఖలేజా రీరిలీజ్‌తో కలకలం
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబోలో వచ్చిన మూవీ ‘ఖలేజా’(Khaleja). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో కనిపించారు. అయితే దీనిని శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2010లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను మే 29న రీరిలీజ్ చేశారు. దీంతో మహేష్ బాబు అభిమానులు హాడావిడి మామూలుగా లేదు. ఆయన సినిమాను మళ్లీ చూస్తే థియేటర్స్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. మరికొందరు మాత్రం ఊహించవిధంగా ప్రవర్తిస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు.
నిర్మాత ఆరోపణలు
అయితే ఓ నెటిజన్లు థియేటర్‌కు బతికున్న పామును చేతులో పట్టుకుని వెళ్లి అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సి కళ్యాణ్ (C Kalyan)షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఖలేజా సినిమాను చంపేసింది. మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఊహించేసుకుని మహేష్ బాబు యాక్టింగ్ వాళ్ళకు అర్ధం కాలేదు. మమ్మల్ని చాలా తిట్టారు. ఆ రోజు మిడ్‌నైట్ షో అన్నారు. షో అయ్యాక తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఓరేయ్ మీకు సినిమా తీయటం తెలుసా అని దారుణంగా మాట్లాడారు. డైరెక్టర్‌ను కూడా తిట్టారు.
అభిమానుల ప్రవర్తనపై విమర్శలు
వాళ్లే మెసేజ్‌లు పెట్టుకుని సర్వనాశనం చేశారు. ఈరోజు ఆ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఖలేజా’ బిగ్ స్క్రీన్‌పై వస్తుంటే.. చూసి వాళ్ళే మళ్లీ ఒప్పుకుంటారు గతంలో సినిమా తీసిన వాళ్ళను తిట్టి తప్పు చేశామని. 15 సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది. కచ్చితంగా సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
చివరకు, ఖలేజా సినిమా రీరిలీజ్‌తో అభిమానుల ప్రతిస్పందన మిశ్రమంగా ఉంది. నిర్మాత వ్యాఖ్యలు సినిమా రిలీజ్ సమయంలోని సంఘటనలను గుర్తు చేస్తాయి.


