
📌 Key Points
- మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా కోసం కోటి రూపాయల చార్మినార్ సెట్!
- గుణశేఖర్ దర్శకత్వంలో 300 మంది సిబ్బందితో నాలుగు నెలలు కష్టపడి పనిచేసిన సెట్.
- నిజమైన చార్మినార్ వద్ద కూడా షూటింగ్, ఉదయం 7:30 లోపు పూర్తి చేయాలనీ కండీషన్స్!
- యుఫోరియా ప్రమోషన్స్ లో ఒక్కడు సినిమా విశేషాలు పంచుకున్న గుణశేఖర్.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే మహేష్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిన ఒక్కడు సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఒక్కడు సినిమా కోసం భారీ సెట్!
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ సినిమాల్లో ఒక్కడు ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి మహేష్ ని స్టార్ చేసింది.(Mahesh Babu)
చార్మినార్ సెట్ కోసం కోటి రూపాయలు ఖర్చు
ఒక్కడు సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టి చార్మినార్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ అప్పటి సంగతులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గుణశేఖర్ త్వరలో యుఫోరియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక్కడు సినిమా గురించి మాట్లాడారు.
గుణశేఖర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు
గుణశేఖర్ మాట్లాడుతూ.. చార్మినార్ సెట్ కి దాదాపు కోటి పైనే ఖర్చు అయింది. నిర్మాత కూడా ఎంతైతే అంత అని పెట్టారు. నాలుగు నెలల పాటు 300 మంది ఆ సెట్ కోసం పనిచేసారు. కానీ కొన్ని సీన్స్ రియల్ చార్మినార్ దగ్గరే తీసాము. చార్మినార్ కింద భూమిక మహేష్ పరిగెసుతుంటే పోలీసుల ఫోర్స్ రావడం, భూమిక, మహేష్ పైకి వెళ్లే సీన్స్, కొన్ని లీడ్స్.. అవన్నీ రియల్ చార్మినార్ దగ్గర చేసాం. కానీ ఇక్కడ ఉదయం పూటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఉదయాన్నే షూటింగ్ చేసేవాళ్ళం. 7.30 లోపు షూటింగ్ ముగించేయాలి. ఒక మూడు రోజులు రియల్ చార్మినార్ దగ్గర షూటింగ్ చేసాం అని తెలిపారు.
మొత్తానికి గుణశేఖర్ ‘ఒక్కడు’ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


