|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేసిన స్టార్ సింగర్, సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన బాహుబలి గాయని ఎవరు?

Published: 14-11-2025, 3:30 AM
మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేసిన స్టార్ సింగర్, సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన బాహుబలి గాయని ఎవరు?

సినీ తారలు సంపాదనతో పాటు సేవా కార్యక్రమాలలోనూ ముందుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. అయితే, ఆయన రికార్డును బ్రేక్ చేస్తూ బాలీవుడ్ గాయని పలక్ ముచ్చల్ 3800 మందికి సహాయం చేసింది. తక్కువ ఆదాయంతో ఆమె ఎలా సాధ్యం చేసిందో చూద్దాం.

Key Points

1

మహేష్ బాబు 3,000కు పైగా చిన్నారులకు గుండె సర్జరీలు చేయించి ప్రాణాలు కాపాడారు.

2

బాలీవుడ్ సింగర్ పలక్ ముచ్చల్ 3,800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది.

4

లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా విరాళాలు సేకరించి పిల్లల వైద్య చికిత్సలకు ఉపయోగిస్తోంది.

మహేష్ బాబు సేవా కార్యక్రమాలు: గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్

సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు సినీ తారలు. అయితే వారిలో కొంత మంది మాత్రమే.. వారి ఆదాయంలో ఎంతో కొంత సమాజసేవకు ఉపయోగిస్తున్నారు. కోట్లు సంపాదించినప్పటికీ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న తపన అందరిలో ఉండదు. అయితే ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా.. సమాజానికి సేవ చేస్తోన్న కొద్దిమంది సెలబ్రిటీలలో.. తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ఇప్పటి వరకు 3 వేలకుపైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి.. వారి ప్రాణాలు కాపాడారు. ఎవరికీ తెలియకుండా, ప్రచారం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా తన గొప్పమనసును చాటుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్.. ఎంత బిజీగా ఉన్నా.. తన పని మాత్రం ఆపలేదు.

మహేష్ బాబు మాత్రమే కాదు.. మరో స్టార్ స్టార్ సెలబ్రిటీల కూడా ఇదే పనిచేస్తూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సింగర్ పలక్ ముచ్చల్ (Palak Muchhal) ఇప్పటివరకు 3800 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. మహేష్ బాబు సంపాదనతో పోల్చుకుంటే పలక్ ముచ్చల్ ఆదాయం చాలా తక్కువ. కానీ ఆమె చేస్తున్న సేవ మాత్రం సూపర్ స్టార్ ను మించిపోయింది. అతి తక్కువ ఆదాయంతో ఇంత పెద్ద పని ఆమె ఎలా చేయగలుగుతుందని అందరు ఆశ్చర్యపోతున్నారు.

పలక్ ముచ్చల్: మహేష్ రికార్డును బ్రేక్ చేసిన బాలీవుడ్ గాయని

సాధారణంగా సింగర్‌ల ఆదాయం సినిమా హీరోలతో పోలిస్తే చాలా తక్కువ. అందులో పలక్ ముచ్చల్ బాలీవుడ్‌లో టాప్ పెయిడ్ సింగర్ కూడా కాదు. ఒక పాటకు వచ్చే పారితోషికం పెద్దగా ఉండదు. అయినప్పటికీ ఆమె తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని చిన్నారుల హార్ట్ ఆపరేషన్ల కోసమే ఆమె వినియోగిస్తోంది. అంతే కాదు సినిమా సింగర్ గా కాకుండా.. బయట నుంచి ఆమె చేసే గా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ వాటి ద్వారా సేకరించిన విరాళాలను పూర్తిగా పిల్లల వైద్య చికిత్సలకు వినియోగిస్తోంది పలక్ ముచ్చల్.

ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కుటుంబం నుంచి పూర్తి సపోర్ట్ ఆమెకు లభిస్తోంది. అంతే కాదు పలక్ ముచ్చల్ కు పలువురు డాక్టర్ల సహాయం లభించినప్పటికీ, మొత్తం ప్రయత్నం ఆమె నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 3800 మంది పిల్లలకు ఆమె సహాయంతో ఆపరేషన్ చేయించుకున్నారు. పలక్ ముచ్చల్ బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో ఆమె బాహుబలి: ది బిగినింగ్, రుద్రమదేవి వంటి చిత్రాలకు పాటలు పాడింది. ఆమె లైవ్ కన్సర్ట్స్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా నిధులు సేకరించడానికి మంచి రూట్ దొరికింది.

తక్కువ ఆదాయంతో గొప్ప సేవ: పలక్ ముచ్చల్ మానవత్వం

భారీ పారితోషికం తీసుకునే సినీనటులు కూడా కొన్నిసార్లు ఇలాంటి సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపకపోవచ్చు. అయితే పలక్ ముచ్చల్ వంటి కళాకారులు, తక్కువ ఆదాయమున్నప్పటికీ వేలాది చిన్నారుల ప్రాణాలను రక్షించడం ద్వారా సమాజానికి ఎంతో సేవచేస్తున్నారు. ఈ విషయంలో పలక్ .. సూపర్ స్టార్ మహేష్ బాబునే మించిపోయింది.

మహేష్ బాబు, పలక్ ముచ్చల్ వంటి సెలబ్రిటీలు తమ సంపాదనతో సమాజ సేవ చేయడం ప్రశంసనీయం. తక్కువ ఆదాయంతో పలక్ ముచ్చల్ చేస్తున్న ఈ గొప్ప సేవ ఎంతో మందికి ఆదర్శప్రాయం. వారి మానవత్వాన్ని, గొప్ప మనసును అభినందిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.