|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో

Published: 29-04-2025, 7:28 AM
మహేష్ బాబు: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మహేష్ బాబు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు తన కొత్త లుక్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా కోసం ఆయన గుబురు గడ్డంతో, పొడవాటి జుట్టుతో కనిపించారు.

Key Points

1

మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2

SSMB29 షూటింగ్ కోసం మహేష్ బాబు తనను తాను మార్చుకుంటున్నారు.

4

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ నటిస్తున్నారు.

మహేష్ బాబు కొత్త లుక్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గత ఏడాది ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ‘SSMB29’ సినిమా చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంచనాలను పెంచుతున్నాయి. ఇక SSMB-29 షూటింగ్ కోసం రాజమౌళి పలు ప్రదేశాలు తిరుగుతున్న విషయం తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే జరగబోతుంది. అయితే ఈ మూవీ కోసం మహేష్ బాబు సైతం తెగ కష్టపడిపోతున్నారు. కొద్ది రోజుల నుంచి పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరం అయ్యారు. అలాగే ఈవెంట్స్‌కు సైతం హాజరవడం లేదు. SSMB-29 కోసం తన బాడీని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మహేష్ బాబు ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో క్రీమ్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆయన ఎవరితోనో ఏది విషయం గురించి చర్చిస్తూ కనిపించారు. గుబురు గడ్డంతో పొడవైన జుట్టుతో మహేష్ షాకింగ్ లుక్‌లో ఉన్నాడు. ఇక ఈ పిక్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఆనంద పడుతున్నారు. అలాగే ఈ లుక్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అవుతుందని అంటున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

SSMB29 కోసం మహేష్ బాబు తీసుకుంటున్న కష్టాలు

అభిమానుల స్పందన

మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. SSMB29 కోసం ఆయన తీసుకుంటున్న శ్రమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.