|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి సినిమా కోసం బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు సాహసం! అసలు రహస్యం ఇదే!

Published: 03-05-2026, 6:00 AM
రాజమౌళి సినిమా కోసం బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు సాహసం! అసలు రహస్యం ఇదే!
  • మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో “వారణాసి” అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.
  • ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక ట్రెక్కింగ్ శిక్షణ తీసుకుంటున్నారు.
  • ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణుడు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో మహేష్ శిక్షణ పొందుతున్నారు.
  • “వారణాసి” ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం, ఇందులో ట్రెక్కింగ్, సాహసోపేతమైన సన్నివేశాలుంటాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వారణాసి” సినిమా కోసం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. సాధారణ వెకేషన్ అనుకున్నప్పటికీ, ఇది సినిమాలోని యాక్షన్, సాహస సన్నివేశాల కోసం చేస్తున్న కఠినమైన ట్రెక్కింగ్ ట్రైనింగ్ అని వెల్లడైంది.

వారణాసి కోసం మహేష్ కఠిన శిక్షణ

Mahesh Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నేపథ్యంలో వారణాసి టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ నటుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు గత కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇటీవలే కీలక షెడ్యూలు కూడా పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే మహేష్ బాబు జర్మనీకి వెళ్లిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

ఇకపోతే సాధారణంగా కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయే మహేష్ బాబు.. ఈసారి కూడా అలా సమ్మర్ హాలిడేస్ కోసం ఫ్యామిలీని తీసుకొని జర్మనీకి వెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం ఫిలిం వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఫిట్నెస్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మహేష్ బాబు. అయితే ఇదంతా సినిమాలో భాగంగానే ఆయన ఈ కష్టమైన ట్రైనింగ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

జర్మనీలో ట్రెక్కింగ్ ట్రైనింగ్ రహస్యం

రాజమౌళి సినిమాలోని యాక్షన్ సీన్స్

ప్రపంచంతో పాటు కాలాన్ని కూడా చుట్టేసే సాహసికుడు కథతో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ట్రెక్కింగ్ తో కూడిన యాక్షన్ సీన్స్ సైతం ఉండనున్నట్లు తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు ఇలా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ఏడాది సినిమా నుండి విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. ఇక అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మందాకిని పాత్ర పోషిస్తూ ఉండగా.. మలయాళీ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరిగి జూన్లో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అనగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఊహకు కూడా అందని కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాజమౌళి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మహేష్ బాబు అంకితభావం, కఠిన శిక్షణ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.