|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసి మూవీ: మహేష్ బాబు ఐదు పాత్రల్లో.. జక్కన్నపై ఫ్యాన్స్ ఫైర్!

Published: 24-01-2026, 8:05 PM
వారణాసి మూవీ: మహేష్ బాబు ఐదు పాత్రల్లో.. జక్కన్నపై ఫ్యాన్స్ ఫైర్!
  • మహేష్ బాబు వారణాసి మూవీలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.
  • ఒక పాత్రలో మహేష్ బాబు త్రేతాయుగానికి వెళ్లనున్నట్లు సమాచారం.
  • ముసలి వ్యక్తి పాత్రలో మహేష్ బాబు 5 నిమిషాలు కనిపించనున్నారు.
  • రాజమౌళి సినిమాను ప్రెస్టేజియస్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఒక పాత్రపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు ఐదు పాత్రల్లో…

Varanasi Movie : దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి మూవీ పై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి.. ప్రేక్షకుల అంచనాలకు ఎక్కడ తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. అయితే గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మహేష్ బాబు ఈ మూవీలో ఐదు పాత్రల్లో నటిస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నాలుగు పాత్రలు ఫ్రాన్స్ ని అలరిస్తే ఐదో పాత్ర మాత్రం ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుందని ఫిలింనగర్లో టాక్.. తాజాగా మహేష్ బాబు ఐదవ గెటప్ గురించి సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది.. అది విన్న ఫ్యాన్స్ రాజమౌళి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఏ గెటప్ లో కనిపించబోతున్నాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. బాహుబలి నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు కూడా జనాలను మెప్పిస్తున్నాయి.. ఇప్పుడు రాబోతున్న వారణాసి మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు 5 పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలిసిందే.. ఈ పాత్రల్లో ఒక పాత్రలో మాత్రం త్రేతాయుగానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అతను రాముడిగా కనిపిస్తాడట.. ట్రావెల్ చేస్తున్న సందర్భంలో మహేష్ బాబు ముసలాయన పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.. ఆ పాత్ర 5 నిమిషాల నిడివితో సాగే పాత్ర కావడంతో మహేష్ ఎలా కనిపిస్తాడో అన్నది ఆసక్తిగా మారింది. ఈ వార్త విన్నా మహేష్ అభిమానులు ఏంటి జక్కన్న మా హీరోని ఏం చేస్తున్నావ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ లో పెడుతున్నారు.. దాంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

త్రేతాయుగానికి మహేష్?

రాజమౌళిపై అభిమానుల ఆగ్రహం

సాధారణంగా రాజమౌళి సినిమాలంటే ఒక లెక్క ఉంటుంది. సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకొని చేస్తున్నాడు. మహేష్ బాబు కూడా అంతే గొప్పగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు.. ఇప్పటికే ఈ షెడ్యూల్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్న రాజమౌళి వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. మహేష్ అభిమానులన్నీ ఎక్కడా నిరాశపరచుకుండా ఈ సినిమా స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీతో జక్కన్న ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఏ హీరో తో సినిమా చేస్తాడో చూడాలి.. మహేష్ బాబు కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో రెండు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

మొత్తానికి రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదా చూడాలి. ఈ మూవీతో జక్కన్న ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.