|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘వారణాసి’ మూవీ షూటింగ్ సీక్రెట్స్ లీక్! మహేష్ ఫ్యాన్స్ కి పండగే!

Published: 09-01-2026, 1:00 AM
షాకింగ్: 'వారణాసి' మూవీ షూటింగ్ సీక్రెట్స్ లీక్! మహేష్ ఫ్యాన్స్ కి పండగే!
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • హైదరాబాద్‌లో కాశీ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
  • ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
  • మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. భారీ కాశీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నారు.

వారణాసి మూవీ షూటింగ్ అప్డేట్స్

Varanasi Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు వారణాసి అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని మహేష్ అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.. ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

మహేష్ బాబు ఇప్పటివరకు ఫ్యామిలీ కథా చిత్రాలలో నటించి మెప్పించాడు.. చివరగా గుంటూరు కారం మూవీలో నటించాడు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్, ఆ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ యావత్ ప్రపంచంలోని సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ మూవీ పై భారీ హైప్ నెలకొంది.. ఇక మహేష్ వేకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో కాశీని తలపించేలా ఓ భారీ సెట్ ను నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సెట్ లోనే తాజాగా షూటింగ్ జరుగుతోంది..ప్రస్తుతం మహేశ్ బాబు మీద ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలుస్తోంది. ఈ సీను ఈ సినిమాకి హైలెట్ గా నిలవని ఉందని సమాచారం.

హైదరాబాద్‌లో కాశీ సెట్ నిర్మాణం

రాముడి పాత్రలో మహేష్ బాబు?

ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈయన షూటింగ్లో జాయిన్ అయ్యారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు అన్న విషయం తెలిసిందే. ఆ పాత్రలో మహేష్ బాబు ఎలా ఉంటాడో చూడాలని ఆయన అభిమానులు సినిమాని అనౌన్స్చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ కోసమే మహేష్ బాబు గుబురు గడ్డం జుట్టును పెంచిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ని త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ కార్యక్రమాలను భారీ ఎత్తున మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో రాజమౌళి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందేమో చూడాలి..

మొత్తానికి రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.