
దర్శకుడు మహేష్ చంద్ర చాలా గ్యాప్ తర్వాత ‘పిఠాపురంలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అలా మొదలైంది’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Key Points
దర్శకుడు మహేష్ చంద్ర చాలా గ్యాప్ తర్వాత ‘పిఠాపురంలో’ చిత్రంతో వస్తున్నారు.
'అలా మొదలైంది' ట్యాగ్‌లైన్‌తో ఇది కుటుంబ భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ.
రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్ వంటివారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
పిఠాపురం, హైదరాబాద్, గోవాలో చిత్రీకరణ జరిపారు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
కుటుంబ భావోద్వేగాలతో పిఠాపురం కథ
‘ప్రేయసి రావే’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ చంద్ర. తర్వాత ‘అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్’ వంటి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈయన.. చాలా గ్యాప్ తర్వాత ‘పిఠాపురంలో’ మూవీతో రాబోతున్నాడు. ‘అలా మొదలైంది’ అనే ట్యాగ్ లైన్‌లో రాబోతున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించాడు డైరెక్టర్ మహేష్‌చంద్ర.
‘కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ చూడొచ్చు. ప్రేక్షకులు ఏదో ఒకరకంగా ఈ కథతో కనెక్ట్ అవుతారు. ఈమధ్య కాలంలో ‘పిఠాపురం’ అనేది ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 6 రోజులు చిత్రీకరణ జరిపాం. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. గోవాలో ఒక పాటను, హైదరాబాద్‌లో సెట్‌వేసి ఇంకో పాటను, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్‌లో మరో పాటను చిత్రీకరించాం. దర్శకునిగా నాకు జీవితాన్ని ప్రసాదించిన ‘మూవీమొఘల్’ డి. రామానాయుడు స్ఫూర్తితో కథను నమ్మి, ఎక్కడా వేస్టేజ్ లేకుండా ఈ సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని తెలిపారు.
దర్శకుడు మహేష్ చంద్ర ప్లానింగ్
చిత్రీకరణ విశేషాలు, విడుదల అప్డేట్
మహేష్ చంద్ర ‘పిఠాపురంలో’ సినిమా ద్వారా ప్రేక్షకులు ఏదో ఒకరకంగా కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. డి. రామానాయుడు స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ ప్రేమకథ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


