
మలయాళ సినిమా నటి మమిత బైజు ‘ప్రేమలు’ సినిమాతో పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘ప్రొడక్షన్-20’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత్ ప్రతాప్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
మలయాళ నటి మమిత బైజు ‘ప్రేమలు’ సినిమాతో పేరు తెచ్చుకుంది.
సంగీత్ ప్రతాప్‌తో కలిసి నటిస్తున్న ‘ప్రొడక్షన్-20’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల.
సంగీత్ చేసిన పోస్ట్‌లో ప్రేమను అనుకోకుండా జరిగిందని పేర్కొన్నారు.
నెటిజన్లు మమిత, సంగీత్ ప్రేమ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు.
మమిత బైజు కెరీర్
మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) ‘ప్రేమలు’ చిత్రంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటన, అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి. దీంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మమితకు వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ప్రేమలు-2(premalu-2), జన నాయగన్(Jana Nayagan), డ్యూడ్, ఇరందు వనం వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్ అయినప్పటికీ అమ్మడు డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. నేడు మమిత పుట్టిన రోజు కావడంతో మరో సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రంలో మమిత హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ప్రొడక్షన్ -20 పేరుతో రాబోతున్న ఈ మూవీకి గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు.
‘ప్రొడక్షన్-20’ చిత్రం ఫస్ట్ లుక్
ఈ చిత్రాన్ని దినోయ్ పాలోస్ తెరకెక్కిస్తుండగా.. దీనిని ఆషిక్ ఉస్వామ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేయగా.. ఇందులో నవ్వుతూ కనిపించి కుర్రాళ్ల గుండెళను కొల్లగొడుతోంది. ఇక ఈ పోస్ట్‌కు సంగీత్ ‘‘ప్రేమ ఎప్పుడూ మెనూలో లేదు.. అనుకోకుండా ఒకరినొకరు ఆర్డర్ చేసుకునే వరకు వచ్చింది’’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే పోస్ట్‌ను మమిత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నెటిజన్ల స్పందన
అయితే ఇది ఒక హోటల్ కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. కాగా, మమిత బైజు, సంగీత్ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది కాలంగా పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె పక్కనే హీరోగా చేసే చాన్స్ కొట్టేశాడు. దీంతో ఈ పోస్టర్‌న్ చూసిన నెటిజన్లు వీరిద్దరు నిజంగా ప్రేమించుకున్నారని చర్చించుకుంటున్నారు. అందుకే ఈ పోస్ట్‌కు స్కిల్స్ వాడి ఇండైరెక్ట్‌గా తన ప్రేమను ఇలా వ్యక్త పరిచాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తంగా, మమిత బైజు మరియు సంగీత్ ప్రతాప్ ల ప్రేమ వ్యవహారంపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్ వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


