
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? క్రైమ్, హారర్, సస్పెన్స్ జోనర్లలో అతని అద్భుతమైన నటనను చూడండి.
Key Points
మమ్ముట్టి నటనతో అదిరిపోయే థ్రిల్లర్లు
క్రైమ్, హారర్, సస్పెన్స్ జోనర్లు
మిస్ చేయకండి!
మమ్ముట్టి థ్రిల్లర్లు ఓటీటీలో
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మలయాళం సినిమాలంటేనే కంటెంట్ బాగుంటుందనే టాక్ ఉంది. ఇక ఇందులోనూ మమ్ముట్టి ఎంచుకునే సబ్టెక్ట్ లు, ఆయన యాక్టింగ్ వేరే లెవల్. క్రైమ్, హారర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా ఏ జోనర్ అయినా తన స్టైల్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తారు మమ్ముట్టి. ఆయన సినిమాల్లోని బెస్ట్ థ్రిల్లర్లు ఇక్కడున్నాయి. అవి ఏ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.
మనవ మెదడులోని సమస్యల కారణంగా, ఆశ చుట్టూ తిరిగే మానవ వ్యక్తిత్వం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో చూసే చిత్రమే ‘భ్రమ యుగం’. ఈ హారర్ థ్రిల్లర్ లో మమ్ముట్టి వన్ మ్యాన్ షో ఉంటుంది. రహస్యంగా ఉండే ఓ పాడుబడ్డ బంగ్లాలోకి ఓ ఫోక్ సింగర్ వస్తాడు. అక్కడే ఉంటున్న మమ్ముట్టి దగ్గర ఇరుక్కుపోతాడు. మమ్ముట్టి క్యారెక్టర్ అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలు కథ ఏంటీ అనేది అదిరిపోతుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇది సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.
క్రైమ్, హారర్ సినిమాల జాబితా
కన్నూర్ స్క్వాడ్ అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇదో మస్ట్ వాచ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్స్ ను పట్టుకునేందుకు హీరో పోలీస్ గ్యాంగ్ చేసిన జర్నీ ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో ఉంది.
కుటుంబంలోని బంధాలు, గొడవలు, పగలు, ప్రతీకారాల చుట్టూ సాగే ఫిల్మ్ భీష్మ పర్వం. ఇందులో కుటుంబ పెద్దగా, నగరాన్ని వణికించే వ్యక్తిగా మమ్ముట్టి యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇందులో సస్పెన్స్ కు కొదవలేదు. అలాగే ఎమోషనల్ గానూ డెప్త్ ఉంటుంది. ఈ ఫిల్మ్ ను కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీ లో చూడొచ్చు.
ఏ ఓటీటీలో చూడాలి?
సైకలాజికల్ థ్రిల్లర్ రోర్‌షాచ్. ఈ సినిమాలో మమ్ముట్టి ఎన్ ఆర్ ఐగా నటించారు. తన భార్యతో కలిసి వెకేషన్ కోసం కేరళకు వస్తారు. అడవి మార్గంలో వాళ్ల కారుకు ప్రమాదం జరుగుతుంది. కోలుకున్న తర్వాత చూస్తే తన భార్య కనిపించదు. తన భార్య కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ గ్రామంలోనే సెటిల్ అవుతాడు. అక్కడ కొన్ని సంఘటనలు మిస్టీరియస్ గా జరుగుతాయి. ఈ మూవీని జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.
టర్బో మూవీ అనేది కామెడీ థ్రిల్లర్. ఇందులో జీప్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు హీరో. హాయిగా సాగుతున్న అతని జీవితం కొన్ని సంఘటనలతో మలుపు తిరుగుతుంది. స్టీరింగ్ పట్టుకున్న చేతులతో గన్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మూవీ సోనీ లివ్ లో ఉంది.
మమ్ముట్టి నటనతో అలరించే ఈ థ్రిల్లర్ సినిమాలు మీరు తప్పకుండా చూడాలి. క్రైమ్, హారర్, సస్పెన్స్ అభిమానులకు ఇవి మంచి వినోదాన్ని అందిస్తాయి. వెంటనే ఓటీటీలో వీక్షించండి!


