
📌 Key Points
- మెగాస్టార్ సినిమాకు అమెరికాలో తక్కువ స్క్రీన్లు ఉండటంపై అభిమానుల అసంతృప్తి.
- దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఫిర్యాదులు.
- స్క్రీన్లు పెంచితే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
- ప్రభాస్ సినిమా స్క్రీన్లను మెగాస్టార్ సినిమాకు కేటాయించాలని అభిమానుల డిమాండ్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాకు మంచి టాక్ వస్తున్నప్పటికీ, అమెరికాలో మాత్రం అభిమానులు థియేటర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తగినన్ని స్క్రీన్లు లేకపోవడంతో సినిమా చూడటానికి ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోంది.
అమెరికాలో మెగాస్టార్ సినిమాకు తక్కువ స్క్రీన్లు
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా..అమెరికాలో మాత్రం కొంతమంది తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అమెరికాలో పెద్ద ఎత్తున స్క్రీన్లు, షోలు ఉంటాయి. కానీ ఈసారి చాలా నగరాల్లో ఈ సినిమా దగ్గర్లోని థియేటర్లలో అందుబాటులో లేదని అభిమానులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చాలా దూరం ప్రయాణం చేస్తేనే షో దొరుకుతోందని సోషల్ మీడియాలో ఫిర్యాదులు పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్..చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తెలుగు కుటుంబాలు ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
పండుగ సమయంలో కుటుంబంతో కలిసి సినిమా చూడటం ఆనందంగా ఉండాలి. కానీ ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడంతో వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. దీని వల్ల పండుగ ఫీలింగ్ తగ్గిపోతోందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లలేక అభిమానుల ఇబ్బందులు
ఇక ట్రేడ్ వర్గాల మాట ప్రకారం.. సినిమాకు డీసెంట్ టాక్ ఉన్న నేపథ్యంలో అమెరికాలో మరిన్ని స్క్రీన్లు పెడితే కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉందని సమాచారం. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు స్పందించి అదనపు షోలు, స్క్రీన్లు పెడితే మంచిదని మెగా అభిమానులు కోరుతున్నారు.
మరోవైపు ప్రభాస్ రాజా సాబ్.. అమెరికాలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆ సినిమాకు ఉన్న స్క్రీన్లను మన శంకర్ వరప్రసాద్ గారికి.. కేటాయించాలని అభిమానుల డిమాండ్. అలా చేస్తే ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కుతుందని వారు భావిస్తున్నారు.
స్క్రీన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్న అభిమానులు
దీంతో అమెరికాలో సరైన స్థాయిలో థియేటర్ అందుబాటు ఉంటే, ఈ సినిమా అక్కడ కూడా బలమైన రన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు త్వరగా స్పందిస్తారని మెగా అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
అమెరికాలో మెగాస్టార్ సినిమాకు ఆదరణ ఉన్నప్పటికీ, తగినన్ని థియేటర్లు లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు స్పందించి స్క్రీన్లు పెంచితే సినిమాకు మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.


